కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సంచలన ప్రకటన చేసింది. భారత దేశానికి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వివేక్ రఘువంశీపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు మంగళవారం కీలక వివరాలు వెల్లడించింది దర్యాప్తు సంస్థ. ఇక్కడ రక్షణ శాఖకు సంబంధించిన వివరాలను సేకరించడం, వాటిని ఇతర విదేశాలకు, అక్కడి నిఘా సంస్థలకు, రక్షణ శాఖలకు పంపుతున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు అభియోగాలు మోపింది.
ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ వివేక్ రఘువంశీపై రహస్య చట్టం లోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జర్నలిస్ట్ సెన్సిటివ్ డిఫెన్స్ కు సంబంధించిన అంశాలను , వివరాలను, సమాచారాన్ని పంచుకున్నాడని ఈ విషయం తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి జైపూర్ లోని 12 చోట్ల సీబీఐ సోదాలు చేపట్టింది.
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి వాటిని విదేశాల్లోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో పంచుకున్నందుకు వివేక్ రఘువంశీపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది సీబీఐ. సున్నితమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది .
