Rishi Sunak : యుఎస్ తో స్నేహం..ఉక్రెయిన్ కు స‌పోర్ట్ – సున‌క్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి

Rishi Sunak : బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రిగా కొలువు తీరిన భార‌తీయ సంత‌తికి చెందిన రిషి సున‌క్(Rishi Sunak) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న ఆయ‌న త‌న‌ను అభినందించిన భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ , ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బ్రిట‌న్ , అమెరికా దేశాలు గ‌త కొన్నేళ్లుగా స‌త్ సంబంధాలు క‌లిగి ఉన్నాయ‌ని ఇదే వాతావ‌ర‌ణం ఇక ముందు కూడా కొన‌సాగుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. కాగా ర‌ష్యా త‌న ఆధిప‌త్య ధోర‌ణిని త‌గ్గించుకుని దాడుల‌ను నిలిపి వేస్తే ప్ర‌పంచానికి, త‌న‌కు మంచిద‌ని సూచించారు రిషి సున‌క్.

త‌మ దేశం త‌న పంథా కేవ‌లం శాంతి తోనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని న‌మ్ముతామ‌న్నారు. ఇదే విషయాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. అంతిమంగా గ‌తంలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.

విదేశీ సంబంధాల విష‌యంలో కీల‌క‌మైన పాత్ర ఉంటుంద‌ని అందుకే ప్ర‌తి దేశంతో బ్రిట‌న్ త‌న స్నేహ పూర్వ‌క‌మైన మైత్రిని కొరుకుంటుంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి రిషి సున‌క్(Rishi Sunak).

ఇప్పుడు ప్ర‌పంచానికి కావాల్సింది శాంతి అని యుద్దం కాద‌న్న విష‌యం తెలుసు కోవాల‌ని సూచించారు. ఇక‌నైనా ర‌ష్యా త‌న నిర్ణ‌యంపై పున‌రాలోచించు కోవాల‌ని కోరారు రిషి సున‌క్.

బేష‌ర‌తుగా త‌న మ‌ద్ద‌తు ఉక్రెయిన్ కు ఉంటుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు పీఎం.

Also Read : సుయెల్లా బ్రేవర్‌మాన్ కు మ‌ళ్లీ ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!