Emmanuel Macron : పుతిన్ కు మాక్రాన్ వార్నింగ్

యుద్ధం ఆప‌క పోతే తీవ్ర ప‌రిణామాలు

Emmanuel Macron : ర‌ష్యా ఉక్రెయిన్ పై దాడి చేయ‌డాన్ని వెంట‌నే నిలిపి వేయాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు ఫ్రెంచ్ దేశ అధ్య‌క్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్(Emmanuel Macron). చేసుకున్న ఒప్పందాల‌ను ఎలా ఉల్లంఘిస్తారంటూ ప్ర‌శ్నించారు.

ఆర్థిక ఆంక్ష‌లు విధిస్తామ‌ని పేర్కొన్నారు. ఉక్రేనియ‌న్ సంక్షోభ‌యంపై మాక్రాన్ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఇది అత్యంత హేయ్య‌క‌ర‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.

తాము చివ‌రి వ‌ర‌కు యుద్ధానికి వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేశాడు. యుద్దం వ‌ల్ల ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వ‌ల్ల ఒన‌గూరే లాభం ఏమిటో ప్ర‌పంచానికి చెప్పాల‌ని నిల‌దీశాడు పుతిన్ ను.

ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యా అంటే ఓ స‌ద‌భిప్రాయం ఉండేద‌ని కానీ ఇలా ఏక‌ప‌క్షంగా దాడికి పాల్ప‌డితే ఎలా అని నిల‌దీశారు. దేశానికి బాధ్య‌త క‌లిగిన చీఫ్ గా పుతిన్ ను జాతి సాక్షిగా హెచ్చ‌రిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.

ప్ర‌శాంత‌త‌, సంక‌ల్పం, ఐక్య‌త‌తో కూడిన దేశాల మ‌ధ్య ఉండాల‌న్న‌దే త‌మ అభిప్రాయమ‌ని స్ప‌ష్టం చేశారు మాక్రాన్. తాము ఎట్టి ప‌రిస్థితుల్లో దాడుల‌ను ఒప్పుకోబోమంటూ చెప్పారు.

ర‌ష్యా సైనిక కార్య‌క‌లాపాల‌కు తాము స‌హ‌క‌రించ‌మ‌ని, దాని ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఆంక్ష‌లు విధించ‌డం ఖాయ‌మ‌న్నారు. యూరోపియ‌న్ మిత్ర దేశాల సార్వ‌భౌమాధికారం, స్థిర‌త్వాన్ని ర‌క్షించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు మాక్రాన్.

దాడుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకోబోమంటూ మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు మాక్రాన్. ఇది పూర్తిగా ప్ర‌పంచాన్ని అస్థిర ప‌రిచే, ఆందోళ‌న క‌లిగించే చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించాడు. అన్ని దేశాలు ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు మాక్రాన్.

Also Read : ఇమ్రాన్ టూర్ పై అమెరికా కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!