Putin : మామూలోడు కాదు పుతిన్ పులి లాంటోడు

ఎవ‌రికీ అంద‌డు ఇంకెవ‌రికీ చిక్క‌డు

Putin : ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు ఒకే ఒక్క‌డి పేరు జ‌పిస్తోంది. ఒక‌ప్ప‌టి ర‌ష్యా ఇప్పుడు ఏకాకిగా మారింద‌ని అనుకుంటే పొర‌పాటు. ప్ర‌స్తుతం ఉక్రెయిన్ ను టార్గెట్ చేస్తూ యుద్ధాన్ని ప్ర‌క‌టించాడు.

ప్ర‌స్తుతం తుపాకుల మోత‌, మిస్సైళ్ల దాడుల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. పుతిన్(Putin) ఎలాంటి వాడో తెలుసు కోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఉత్సుక‌త ఉంటుంది. చూస్తే చాలా ప్ర‌శాంతంగా ఉంటాడు.

కానీ ఆయ‌న అంత‌రంగంలో ఏముందో ఎవ‌రికీ అర్థం కాదు. ఆయ‌న‌పై ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చినా పాల‌నా ప‌రంగా చాలా క‌ట్టుదిట్టంగా ఉంటాడు.

ప్ర‌ధానంగా ఇప్పుడు ర‌ష్యాకు అస‌లైన బ‌లం ఏమిటంటే ఆయిల్ నిక్షేపాలు ఉండ‌డం.

బంగారు గ‌నులు కూడా ఉంటాయ‌ని అంటారు. కానీ అది త‌ర్వాత‌. ఇప్పుడు మాత్రం యావ‌త్

ప్ర‌పంచం ఏక‌మైనా యుద్దం వ‌ద్ద‌న్నా ముందుకే క‌దులుతున్నాడు. ఆయ‌న అల‌వాట్లే కాదు ఆచ‌ర‌ణ‌లో కూడా ఊహించ‌లేరు.

ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటాడ‌నేది త‌న‌కే తెలియ‌నంత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం పుతిన్ (Putin) కు పెట్టింది పేరు.

ఉక్రెయిన్ ప‌క్క‌లో బ‌ల్లెంలా ఉండ కూడ‌ద‌నే ఉద్దేశంతో వార్ ప్ర‌క‌టించాడు.

ముందు నుంచీ ప‌ట్టుద‌ల క‌లిగిన వ్య‌క్తి. ర‌ష్యా లోని సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్ లో 1952లో పుట్టాడు.

న్యాయ శాస్త్రం చ‌దువుకున్నాడు. సోవియ‌ట్ యూనియ‌న్ సీక్రెట్ ఏజెన్సీ – కేజీబీలో 1975 నుంచి 1990 దాకా ఏజెంట్ గా , ఎల్సీగా ప‌ని చేశాడు.

ఆ తర్వాత దేశం ప‌త‌నం కావ‌డంతో క్రెమ్లిన్ లో ప‌ని చేశాడు. ఆ త‌ర్వాత 1991 నుంచి పొలిటిక‌ల్ లో పూర్తిగా ఎంట్రీ అయ్యాడు. 1999లో దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ప‌ని చేశాడు ఏడాది పాటు.

ఆ త‌ర్వాత అధ్య‌క్షుడిగా స‌ర్వాధికారాలు త‌న చేతుల్లో పెట్టుకుని కొన‌సాగుతున్నాడు పుతిన్(Putin). 2018లో నాలుగోసారి ప్రెసిడెంట్ గా ఎన్నిక‌య్యాడు. తాను సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగేందుకు గాను ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేశాడు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచం లోనే ప‌వ‌ర్ ఫుల్ ప‌ర్స‌న్ గా పేరొందాడు పుతిన్. అంతే కాదు అమెరికా ఎన్నిక‌ల్లో కూడా అంత‌ర్గ‌తంగా జోక్యం చేసుకున్నాడ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఆయ‌న‌కు 69 ఏళ్లు కానీ నిత్యం యువ‌కుడిగా ఉంటాడు. 2014లో శాంతి బ‌హుమ‌తికి నామినేట్ అయ్యాడు. విచిత్రం ఏమిటంటే జ‌నాద‌ర‌ణ‌లో పుతిన్ టాప్ లో ఉన్నాడు. మ‌నోడు ర‌క్తం మ‌రిగిన పులి లాంటోడు.

ఆయ‌న హ‌యాంలోనే నాలుగుసార్లు యుద్దం జ‌రిగింది. పుతిన్ ఆట‌ల ప్రేమికుడు. మ‌నోడికి ఫుట్ బాల్ అంటే చ‌చ్చేంత ఇష్టం. పెంపుడు జంతువులంటే ప్రాణం.

Also Read : అమెరికా వ్య‌వ‌హారం ఉక్రెయిన్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!