Modi Putin : పుతిన్ తో మాట్లాడ‌నున్న మోదీ

వెల్ల‌డించిన కేంద్ర మంత్రిత్వ శాఖ‌

Modi Putin : ర‌ష్యా ఉక్రెయిన్ పై దాడుల నేప‌థ్యంలో ఇప్ప‌టికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార‌తీయుల‌ను ర‌క్షించేందుకు భార‌త ప్ర‌భుత్వం(Modi Putin) శ‌త విధాలుగా ప్ర‌య‌త్నం చేస్తోంది.

యుద్దం కొన‌సాగుతున్న త‌రుణంలో గ‌గ‌న త‌లాన్ని మూసి వేశారు. దీంతో భార‌త దేశానికి చెందిన 20 వేల మందికి పైగా స్టూడెంట్స్ ఉక్రెయిన్ లో చిక్కుకున్నారు.

ఇందులో అత్య‌ధికంగా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారున్నారు. ఓ వైపు బాంబుల మోత ఇంకో వైపు మిస్సైల్స్ దాడుల‌తో త‌ల్ల‌డిల్లుతోంది ఉక్రెయిన్.

భార‌త దేశంలో ఉన్న ఉక్రెయిన్ రాయ‌బారి సైతం మోదీని ర‌ష్యా ప్రెసిడెంట్ తో మాట్లాడాల‌ని ప్ర‌త్యేకంగా విన్న‌వించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాడుల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం.

కానీ ర‌ష్యా ఆగ‌డం లేదు. ఇంకో వైపు ఉక్రెయిన్ చివ‌రి వ‌ర‌కు పోరాడుతామ‌ని ప్ర‌క‌టించారు ఆ దేశ అధ్య‌క్షుడు. నాటో దేశాలు సానుభూతి ప్ర‌క‌ట‌న‌లు మాత్ర‌మే చేస్తున్నారే త‌ప్పా ఆచ‌ర‌ణ‌లో స‌పోర్ట్ చేయ‌డం లేదు.

ఇంకో వైపు ఫ్రెంచ్, యూకే, అమెరికా దేశాలు ఇప్ప‌టికే ర‌ష్యాపై ఆర్థిక ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. కానీ వాటిని బేఖాత‌ర్ చేస్తూ యుద్దానికి సై అన్నారు పుతిన్.

ఈ త‌రుణంలో మోదీకి (Modi Putin)ర‌ష్యా ప్రెసిడెంట్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. వీరిద్ద‌రు ప‌లుసార్లు క‌లిసి మాట్లాడుకున్నారు.

దీంతో యుద్దాన్ని నివారించేందుకు గాను మోదీ పుతిన్ తో ఇవాళ టెలిఫోన్ లో మాట్లాడ‌తార‌ని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

ఆఫ్గ‌నిస్తాన్ విష‌యంలో ర‌ష్యా, భార‌త్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాయి. ప్ర‌స్తుతం మోదీ చ‌ర్చ‌ల‌పైనే యావ‌త్ ప్ర‌పంచం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది.

Also Read : మోదీజీ పుతిన్ తో మాట్లాడండి

Leave A Reply

Your Email Id will not be published!