Delhi LG : ఢిల్లీ పోలీస్ బాస్ కు ఫుల్ పవర్స్
లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ
Delhi LG : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ బాస్ కు ప్రత్యేక అధికారాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీస్ చీఫ్ కు ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ నగరానికి ముప్పుగా మారే వారిని నిరోధక నిర్బంధంలోకి తీసుకునేందుకు సర్వాధికారాలు కట్టబెట్టారు. జాతీయ భద్రతా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు వినయ్ కుమార్ సక్సేనా(Delhi LG). ప్రస్తుతం ఆయన ఢిల్లీ ఎల్జీగా కొలువు తీరిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
ఆయనకు ప్రస్తుత ఆప్ సర్కార్ కు మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఎల్జీ దెబ్బకు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. లిక్కర్ స్కాం పై విచారణకు ఆదేశించడంతో పెద్ద ఎత్తున అక్రమాలు బయట పడ్డాయి.
ఇప్పటికే డిప్యూటీ సీఎంతో పాటు 14 మందిపై అభియోగాలు మోపింది సీబీఐ. తాజాగా ఢిల్లీ పోలీస్ బాస్ కు పవర్స్ కట్టబెట్టడంతో చర్చనీయాంశమైంది.
ఈ ఉత్తర్వులు అక్టోబర్ 19 నుంచి అమలులోకి వస్తాయని జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 18 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. రాజధానికి ముప్పు తలపెట్టాలని చూసిన వారిని జాతీయ భద్రతా చట్టం (ఎన్ఐఏ) కింద అదుపులోకి తీసుకునేందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎవరైనా అనుమానం వస్తే అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
Also Read : పార్టీ ముందు ఒకలా బయట మరోలా