G Kishan Reddy : ప్రతి ఇంటా జాతీయ జెండా
దేశమంతటా తిరంగా ఎగరాలి
G Kishan Reddy : దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లవుతోంది. ఇంకా జాతీయ స్పూర్తిని కలిగించేందుకు నేతలు పిలుపునిస్తున్నారు. జాతీయ పతాకం తయారు చేసిన కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఈ తరుణంలో కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
G Kishan Reddy Follow’s Modi Rule
ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్బంగా కార్యక్రమాలను చేపట్టడంలో ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ జాతికి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆత్మ గౌరవాన్ని తీసుకు వచ్చే అరుదైన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించు కోవాలని కోరారు ప్రధానమంత్రి.
సోమవారం హైదరాబాద్ లోని బర్కత్ పురలో తిరంగా యాత్రను ప్రారంభించారు కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి(G Kishan Reddy). నా నేల నా దేశం కార్యక్రమంలో స్వతంత్ర వీరులను స్మరించు కోవాలని అన్నారు. జాతీయ జెండాలను ఎగుర వేసి త్రివర్ణ పతాకాలతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు.
ఈ వేడుకల్లో ప్రతి ఇంటా త్రివర్ణ పతాకంతో ఎగరాలని, ఈ అరుదైన క్షణాలు మళ్లీ రావన్నారు. ఇదే సమయంలో మొక్కలు , చెట్లు నాటాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. దీనికి అమృత వనం పేరు పెట్టాలని సూచించారు.
Also Read : Kanwal Rekhi : కేటీఆర్ సూపర్ లీడర్ – కన్వల్ రేఖీ