G Kishan Reddy : బీఆర్ఎస్ స‌ర్కార్ పై కిష‌న్ రెడ్డి ఫైర్

ఎంఐఎం ఒత్తిడితోనే మెట్రో ఆల‌స్యం

G Kishan Reddy : బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఎంఐఎంను ఏకి పారేశారు. పాత‌బ‌స్తి వ‌ర‌కు మెట్రో పొడిగింపు ప‌నులు కాకుండా నిర్ల‌క్ష్యం వ‌హిస్తోందంటూ బీఆర్ఎస్ స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ చీక‌టి ఒప్పందం వ‌ల్ల‌నే ఇవాళ పాత‌బ‌స్తీకి మెట్రో రాక ఆల‌స్యం జ‌రుగుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు జి. కిష‌న్ రెడ్డి.

కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా హైద‌రాబాద్ లోని పాత‌బ‌స్తీ దాకా హైద‌రాబాద్ మెట్రో రైలు సౌక‌ర్యాన్ని పొడిగించాల‌ని నిర్ణ‌యించామ‌ని, కానీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో కొలువు తీరిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ప్ర‌భుత్వం కావాల‌ని తాత్సారం చేస్తోందంటూ ఆరోపించారు జి. కిష‌న్ రెడ్డి(G Kishan Reddy). ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌ట్ట బ‌య‌లు చేస్తూ వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం మెట్రో కు సంబంధించి పాత బ‌స్తీ వ‌ర‌కు పొడిగిస్తామంటూ ప్ర‌క‌ట‌న చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు బీజేపీ స్టేట్ చీఫ్. ఇదంతా కేవ‌లం రాబోయే ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకు చేస్తున్న జిమ్మిక్కుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి ఒదిలేసిన సీఎం ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : MLA Seethakka Comment : ‘సీత‌క్క’ సీఎం అవుతుందా..?

Leave A Reply

Your Email Id will not be published!