G Kishan Reddy : రాహుల్ దమ్ముంటే చర్చకు రా
సవాల్ విసిరిన జి. కిషన్ రెడ్డి
G Kishan Reddy : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన కూడా మాటల దాడి పెంచారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నేత, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.
G Kishan Reddy challenge to Rahul Gandhi
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ రాహుల్ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా మండిపడ్డారు. తాము కలిసి పోయామని పదే పదే చెబుతూ ప్రజల్లో గందరగోళం సృష్టించ వద్దంటూ కోరారు. మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన నుంచి ప్రజలు విముక్తం కాబోతున్నారని జోష్యం చెప్పారు.
నాలుగున్నర కోట్లలో 3 కోట్ల 27 లక్షల మంది ఓటు హక్కు వినియోగించు కోబోతున్నారని అన్నారు. మీరంతా చాలా జాగ్రత్తతో తమ విలువైన ఓటు పని చేసే వారికి వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన వల్ల దేశం, రాష్ట్రం ఇన్నేళ్లుగా పూర్తిగా వెనుకబడి పోయాయని ఆరోపించారు.
రాహుల్ గాంధీ చర్చకు రావాలని లేదా ఎక్కడికి రావాలో చెప్పాలని డిమాండ్ చేశారు జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy). తమకు ముస్లిం సమాజంపై కోపం లేదన్నారు. ఆ వర్గాలను అడ్డం పెట్టుకుని దందాలు చేస్తున్న మజ్లిస్ పార్టీపైనే తమకు వ్యతిరేకత ఉందన్నారు బీజేపీ చీఫ్.
కేటీఆర్ ను సీఎం కావాలని కేసీఆర్ కోరికతో ఉన్నాడని స్పష్టం చేశారు.
Also Read : Revanth Reddy : మామా అల్లుళ్ల వల్లనే రైతు బంధుకు బ్రేక్