G Kishan Reddy : కాళేశ్వరం అవినీతిమయం
బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డి ఫైర్
G Kishan Reddy : మేడిగడ్డ – కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి. ఈటెల రాజేందర్ , రఘునందన్ రావుతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్బంగా మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించిన పిల్లర్లు కుంగి పోవడాన్ని దగ్గరుండి వీరంతా చూశారు.
G Kishan Reddy Comments on Kaleshwaram
అనంతరం మీడియాతో జి. కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో నిర్మించిన ప్రాజెక్టుగా అభివర్ణించారు. కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలోని డ్యామ్ సేఫ్టీ టీం పరిశీలించిందని, సంచలన అంశాలు బయట పెట్టిందని చెప్పారు.
అసలు డిజైన్ లోనే పూర్తిగా తప్పు ఉందన్న వాస్తవం సీఎం కేసీఆర్ కు తెలియక పోవడం దారుణమన్నారు కిషన్ రెడ్డి(G Kishan Reddy). సోయి తప్పి ఫామ్ హౌస్ లో పడుకుంటే అవినీతి చోటు చేసుకోకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ ఇలా అయితే రేపొద్దున భారీ వర్షాలు వస్తే కూలి పోయే ప్రమాదం లేక పోలేదన్నారు. సేఫ్టీ టీమ్ వెల్లడించిన అంశాలలో మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల కూడా ఆందోళనకరంగా ఉన్నాయని దీనిపై ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరంద ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు జి. కిషన్ రెడ్డి.
ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read : Pawan Kalyan : పవన్..బాబు కీలక భేటీ