G kishan Reddy : బ‌ల‌ప‌డ్డాం లోపాలు దిద్దుకుంటాం

బీజేపీ స్టేట్ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి

G kishan Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఫ‌లితాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ , కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి(G kishan Reddy). సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్ల‌డారు. గ‌తంలో లేని రీతిలో తాము బ‌ల‌ప‌డ్డామ‌ని, లోపాల‌ను స‌రి చేసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

G kishan Reddy Comment

అయితే తాము అనుకున్న ఫ‌లితాలు రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల కంటే బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింద‌న్నారు. ఇది ఒక ర‌కంగా త‌మ‌కు సంతోషం క‌లిగిస్తోంద‌ని చెప్పారు జి. కిష‌న్ రెడ్డి.

13 శాతానికి పైగా ఓట్లు సాధించామ‌ని , 8 సీట్లు వ‌చ్చాయ‌ని , ప్ర‌జ‌లు త‌మ వైపు చూశార‌నేది తేలి పోయింద‌న్నారు. జాతీయ నాయ‌క‌త్వంతో స‌మీక్షించ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. అన్ని చోట్లా ఎక్క‌డ బ‌ల ప‌డ్డామో, ఎక్క‌డ ఎందుకు ఓడి పోయామనే దానిపై రివ్యూ చేస్తామ‌న్నారు.

ఇక త్వ‌ర‌లోనే రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని, క‌నీసం 10 సీట్ల‌నైనా తాము గెలిచేందుకు ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు జి. కిష‌న్ రెడ్డి.

Also Read : DK Shiva Kumar : అన్నీ తానైన డీకే శివ‌కుమార్

Leave A Reply

Your Email Id will not be published!