G Kishan Reddy : మ‌ణిపూర్ ఘ‌ట‌నపై నో కామెంట్

నాకేం సంబంధం అంటూ ప్ర‌శ్న

G Kishan Reddy : ఆయ‌న బాధ్య‌త క‌లిగిన కేంద్ర మంత్రి. ఆపై తెలంగాణ బీజేపీకి చీఫ్. తాజాగా పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టారు. దేశ మంత‌టా మ‌ణిపూర్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న పై నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. చ‌ర్చ‌కు దారి తీసింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మౌనంగా ఉండ‌డాన్ని త‌ప్పు ప‌డుతోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ప‌లు జాతీయ స్థాయి నేత‌లు సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G Kishan Reddy Words

శ‌నివారం జి. కిష‌న్ రెడ్డి(G Kishan Reddy) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌ణిపూర్ ఘ‌ట‌న‌తో నాకేం సంబంధం అంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు. దానిపై తాను కామెంట్ చేయ‌ద‌ల్చు కోలేద‌న్నారు. మంత్రి వింత స‌మాధానంపై ప‌లువురు విస్తు పోయారు.

బీజేపీ పాల‌న‌లో దారుణాల‌కు కొదువ లేకుండా పోయింది. గుజ‌రాత్ ప్ర‌భుత్వం సామూహిక అత్యాచారానికి పాల్పడి జీవిత ఖైదు విధించిన వారిని బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చింది. ఆపై నుపుర్ శ‌ర్మ బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేసినా ప‌ట్టించు కోలేదు. ఇక మణిపూర్ లో గ‌త కొన్నాళ్లుగా ర‌గులుతోంది. కానీ నోరు విప్ప‌డం లేదు.

దీనిపై రాహుల్ గాంధీ ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. ఆయ‌న మ‌ణిపూర్ ను సంద‌ర్శించారు. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశారు. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. కానీ కిష‌న్ రెడ్డి మాత్రం త‌న‌కేం సంబంధం అంటూ ప్ర‌శ్నించ‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : Palanivel Tyagarajan : తెలంగాణ ఐటీ సెక్టార్ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!