G Kishan Reddy KCR : మా పంతం కుటుంబ పాలన అంతం
కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి
G Kishan Reddy KCR : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి అసలైన ఆట మొదలైందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇక్కడ నైతిక విజయం సాధించినట్లు స్పష్టం చేశారు.
తాము తెలంగాణలో మరింత బలపడడం జరిగిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్నది తామేనని వేరే పార్టీ లేదన్నారు. ఈ విషయం గతంలో దుబ్బాక, హుజూరాబాద్ లో నిరూపితమైందన్నారు. ప్రస్తుతం జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం రెండో ప్లేస్ లో నిలిచిందని చెప్పారు కిషన్ రెడ్డి.
ఉప ఎన్నికల సమయంలో అధికారాన్ని, పాలనా యాంత్రాంగాన్ని, మొత్తంగా క్యాబినెట్ ను , పోలీస్ ను, ఎన్నికల సంఘాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుని ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపించారు. అయినా ప్రజలు నైతికంగా తమ వైపు ఉన్నారనేది తేలిందన్నారు కేంద్ర మంత్రి.
ప్రధానంగా తప్పుడు ప్రచారం చేయడంలో సీఎం కేసీఆర్(CM KCR), ఆయన పరివారం విజయం సాధించారని ఎద్దేవా చేశారు. మరో వైపు అమిత్ షా, నరేంద్ర మోదీలను వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఒకవేళ ఏమైనా ఆధారాలు ఉన్నట్లయితే వాటిని నిరూపించాలని జి. కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
వాళ్ల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. నిజమైన ఆట ఇక నుంచి మొదలవుతుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు.
Also Read : కేటీఆర్ ఆరోపణలన్నీ అబద్దాలే – వివేక్