Amit Shah G20 Summit : జి20 సమ్మిట్ క్రెడిట్ మోదీదే – షా
అన్ని రాష్ట్రాలు భాగమేనన్న మంత్రి
Amit Shah G20 Summit : విజయవంతమైన జి20 సమ్మిట్ కు ప్రధానమంత్రి మోదీ క్రెడిట్ పొందడం ఖాయమన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. దేశంలోని పలు ప్రాంతాల్లో 32 విభిన్న రంగాల్లో సుమారు 200 సమావేశాలను భారత్ నిర్వహించడాన్ని ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జి20 ప్రెసిడెన్సీలో ప్రతి రాష్ట్రం భాగమేనని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి(Amit Shah G20 Summit). సదస్సును విజయవంతం చేసిన ఘనత ప్రధాన మంత్రికి దక్కడం సహజేనని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. దీనికి కారణం సమర్థవంతమైన నాయకుడైన నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఉండడమేనని అన్నారు అమిత్ చంద్ర షా.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి. మార్కెట్ లో ఎన్నో ఉత్పత్తులు ఉంటాయి. వాటిలో దేనిని కొనుగోలు చేస్తారో మీకందరికీ తెలుసు. ఎందుకంటే ఉత్పత్తి చేసిన వస్తువు బాగుంటే అందరూ దానికే ప్రయారిటీ ఇస్తారని ఇదే తాము చేస్తున్నామని చెప్పారు అమిత్ చంద్ర షా.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరును చూసి యావత్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూస్తోందన్నారు. జి20 సీరీస్ సమావేశాలను ప్రతి రాష్ట్రంలో నిర్వహించేలా చేశామన్నారు అమిత్ షా(Amit Shah G20 Summit). ఈ మొత్తం క్రెడిట్ నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతుందన్నారు. మీ ఉత్పత్తి బాగుంటే దీర్ఘకాలికంగా దానికి డిమాండ్ ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు ఎదురే లేదన్నారు అమిత్ షా.
Also Read : అదానీపై యుఎస్ కంపెనీ ఆడిట్