Gaddam Prasad Kumar : గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎన్నిక
ఎంపీటీసీ నుంచి సభాపతి దాకా
Gaddam Prasad Kumar : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నూతన స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బుధవారం జరిగిన శాసన సభలో ప్రొటెం స్పీకర్ గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.
Gaddam Prasad Kumar As a Telangana Assembly Speaker
మర్పల్లి ఆయన స్వస్థలం, తొలిసారిగా ఎంపీటీసీగా , ఎంపీపీగా, ఎమ్మెల్యేగా , మంత్రిగా సేవలు అందించారు. రాజకీయ పరంగా అపారమైన అనుభవం ఉంది గడ్డం ప్రసాద్ కుమార్ కు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేలు తప్పా మిగతా అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు తెలిపారు.
2009లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖర్ ను ఓడించారు గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar). 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేనేత, జౌళి, స్పిన్నింగ్ మిల్లులు, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. ఏపీలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో 2012 ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రచార సమన్వయకర్తగా పని చేశారు గడ్డం ప్రసాద్ కుమార్.
2014లో రాష్ట్ర విభజన తర్వాత 2014లో బి. సంజీవ రావుపై , 2018లో ఆనంద్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023లో బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్ ను ఓడించారు గడ్డం ప్రసాద్ కుమార్. రేవంత్ రెడ్డి సమక్షంలో స్పీకర్ గా ఎన్నిక కావడం విశేషం.
Also Read : Nara Lokesh : జగన్ పాలన ఆగమాగం