Gaddar Johar : జనం గొంతుకకు జోహార్
సినీ నటుడు మోహన్ బాబు
Gaddar Johar : జనం గొంతుకై ప్రవహించిన అరుదైన గాయకుడు గద్దర్. ఆయనకు మరణం లేదు. లోకంలో పాట ఉన్నంత కాలం బతికే ఉంటాడు. వ్యవస్థలను ప్రశ్నించాడు. అన్యాయాన్ని, దోపిడీని, దౌర్జన్యాలను తన గొంతుతో నిలదీశాడు. కోట్లాది మంది ప్రజలను తన పాటలతో చైతన్యవంతం చేశాడు. ఆయన మరణంతో ఒక యోధుడిని కోల్పోయింది తెలంగాణ.
Gaddar Johar Says Peoples
ఇలాంటి గాయకుడు రాబోయే రోజుల్లో పుడతాడని అనుకోలేమన్నారు ప్రముఖ నటుడు మోహన్ బాబు. ఆయనతో తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించారు. పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
గద్దర్ ఇంత త్వరగా ఈ లోకం నుంచి వెళ్లి పోతాడని అనుకోలేదన్నారు పలువురు సినీ ప్రముఖులు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా లాల్ సలాం కామ్రేడ్ గద్దర్(Gaddar Johar) అంటూ పేర్కొన్నారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు పవన్ కళ్యాణ్. దర్శకుడు గోపిచంద్ మలినేని స్పందిస్తూ ఇలాంటి గాయకులు అరుదుగా ఉంటారని , ఆయనకు, పాటకు మరణం లేదన్నారు.
Also Read : Gaddar Lal Salam : గద్దరన్నకు లాల్ సలాం