Gajendra Shekhawat : కాంగ్రెస్ విస్మరించిన యోధులకు గుర్తింపు
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
Gajendra Shekhawat : కాంగ్రెస్ పార్టీ ఏలిన కాలంలో దేశ చరిత్రను వక్రీకరించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఆయన సీఎం అశోక్ గెహ్లాట్ ను టార్గెట్ చేశారు.
ఇదిలా ఉండగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబం ఆనవాళ్లను లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు.
చరిత్రను వక్రీకరిస్తూ నెహ్రూ, గాంధీ, ఇందిరా, రాజీవ్ గాంధీల వారసత్వాన్ని పటేల్ లాంటి గొప్ప వ్యక్తుల జ్ఞాపకాలను చెరిపేసే పనిలో పడిందంటూ మండిపడ్డారు సీఎం.
ఎలాంటి చరిత్ర లేనటువంటి వాళ్లకు, దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని వారికి చరిత్రలో చోటు కల్పించేందుకు బీజేపీ యత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు గెహ్లాట్. దీనిపై సీరియస్ గా స్పందించారు కేంద్ర మంత్రి షెకావత్.
అయితే కాంగ్రెస్ దాచి ఉంచిన యోధులను, గొప్ప వారిని మాత్రమే తాము ముందుకు తీసుకు వస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని పేర్కొన్నారు.
అశోక్ గెహ్లాట్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చరిత్రను చదువుకుంటే మంచిదని సూచించారు. పాలన చేతకాక బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు.
తమ ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను చేపట్టేందుకు ప్రధాన కారణం జాతి మరిచి పోయిన వారిని గుర్తు చేసుకోవడమేనని పేర్కొన్నారు షెకావత్(Gajendra Shekhawat) .
మేము చరిత్రను దాచడం లేదు. కానీ ఉద్దేశ పూర్వకంగా ప్రజలకు దాచిన విషయాలను చెబుతున్నామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.
Also Read : ఫారూఖీని తిట్టా ప్రవక్తను అనలేదు