Galla Jayadev: రాజకీయాలకు గల్లా జయదేవ్ గుడ్ బై !
రాజకీయాలకు గల్లా జయదేవ్ గుడ్ బై !
Galla Jayadev: తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. గుంటూరులో ఏర్పాటు మీడియా సమావేశంలో పారిశ్రామిక వేత్తగా రాజకీయాల్లో కొనసాగుతున్న తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నానని… కాబట్టి మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్న జయదేవ్… తాజా నిర్ణయం తాత్కాలికమేనని స్పష్టం చేసారు. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ఆయన వెల్లడించారు. ఈ మేరకు కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ విందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా హాజరవుతారనే చర్చ జరుగుతోంది.
Galla Jayadev Comments Viral
ఈ సందర్భంగా ఎంపీ జయదేవ్ మాట్లాడుతూ… ‘‘ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేను. నా పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన నాలో ఉంది. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను… కానీ రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా. రెండేళ్ల క్రితం మా నాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోంది. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నాను అని జయదేవ్(Galla Jayadev) అన్నారు. ప్రత్యేకహోదా కోసం, అమరావతి రాజధానితో పాటు అనేక రాష్ట్ర సమస్యలపై పార్టీ గొంతును పార్లమెంట్ లో వినిపించానన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ కేసుల్లో ఈడీ నన్ను రెండు సార్లు పిలిచి విచారించింది. నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయి. సీబీఐ, ఈడీ నా ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నాయి’’ అని జయదేవ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆది నుంచి ముఠా రాజకీయాల దూరంగా ఉన్న నేను… స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకొని ముందుకు వెళ్లానని తెలిపారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలికంగా రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు.
మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి వారసుడిగా తెలుగుదేశం పార్టీలో చేరిన గల్లా జయదేవ్… 2014,2019లో వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా జయదేవ్ గెలపొందారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ లో పోరాడారు. అయితే తన కుటుంబానికి చెందిన ఏపీలో అమరరాజా బ్యాటరీస్ సంస్థను… అధికార వైసీపీ ఇబ్బందులకు గురిచేయడంతో తమ సంస్థను తెలంగాణాల, తమిళనాడుల్లో విస్తరణ చేపట్టడంతో అప్పట్లో సంచలనంగా మారింది. అయితే అనూహ్యంగా రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read : KTR in Auto: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్