Statue Of Equality : చిన్న‌జీయ‌ర్ ప్ర‌య‌త్నం గొప్ప‌ది

గ‌ణ‌ప‌తి స‌చ్చిదానం స్వామి కితాబు

Statue Of Equality : శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి చేసిన ప్ర‌య‌త్నం చాలా గొప్ప‌ద‌న్నారు మైసూరు ద‌త్త పీఠం అవ‌ధూత గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి.

ఇవాళ స‌మ‌తామూర్తి(Statue Of Equality )స‌హ‌స్రాబ్ది మ‌హోత్స‌వాల సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు శ్రీ‌రామ‌నగ‌రంకు విచ్చేశారు. రాం దేవ్ బాబా, న‌టుడు అల్లు అర్జున్, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ర‌వి, డీఆడీఓ చీఫ్ స‌తీష్ రెడ్డితో పాటు టీఎస్ విద్యుత్ సంస్థ ఎండీ ప్ర‌భాక‌ర్ రావు పాల్గొన్నారు.

వీరిని రిత్వికులు, అర్చ‌కులు, పండితులు ఆశీర్వ‌దించారు. స‌మ‌తా కేంద్రంలో 216 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స‌మ‌తా మూర్తి విగ్ర‌హాన్ని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం భ‌క్తుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం గొప్ప ఆధ్యాత్మిక ప్రాంతంగా మార‌బోతుంద‌న్నారు. దక్షిణాదిన గొప్ప పుణ్య క్షేత్రాల‌లో శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యుల ఉత్స‌వ మూర్తి శాశ్వ‌తంగా నిలిచి పోతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

అంత‌కు ముందు స‌మ‌తామూర్తి(Statue Of Equality )ప్రాంగ‌ణం విశేషాల‌ను వివ‌రించారు చిన్న జీయ‌ర్ స్వామి. అక్క‌డే భ‌క్తుల‌తో ముచ్చ‌టించారు. యాగ‌శాల‌కు చేరుకుని శ్రీ ల‌క్ష్మి నారాయ‌ణ మ‌హా క్ర‌తువులో పాల్గొన్నారు.

పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో పాల్గొని య‌జ్ఞ ప్ర‌సాదాన్ని అందుకున్నారు. త‌మ‌కు ద‌త్త పీఠాధిప‌తికి మ‌ధ్య ఉన్న స‌న్నిహిత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా రాం దేవ్ బాబా చిన్న జీయ‌ర్ ను ఆకాశానికి ఎత్తేశారు. రూ. 1000 కోట్ల‌తో ఖ‌ర్చు చేయ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ణ‌మిల్లుతున్నాన‌ని చెప్పారు. రాబోయే త‌రాలు క‌ల‌కాలం గుర్తు పెట్టుకుంటాయ‌ని కితాబు ఇచ్చారు.

Also Read : అహం వీడండి సామాజిక సేవ‌లో త‌రించండి

Leave A Reply

Your Email Id will not be published!