Supreme Court : ఈద్గా గ్రౌండ్ లో గణేష్ ఉత్సవాలకు ఓకే
అర్ధరాత్రి పర్మిషన్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court : గణేష్ ఉత్సవాలను ఈద్గా మైదానంలో నిర్వహించాలా వద్దా అన్న దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెర దించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court).
ఈ మేరకు ఈ వివాదాస్పద అంశానికి సంబంధించి విచారణ చేపట్టింది. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కర్ణాటక లోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలు అనుకున్న ప్రకారం నిర్వహించు కోవచ్చని స్పష్టం చేసింది.
బెంగళూరు ఈద్గా మైదానం ను స్తంభింప చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను తిరస్కరించింది. ఈద్గా భూమి విషయంలో యాజమాన్యంపై తీవ్రమైన వివాదం హుబ్బెళ్లీ కేసులో లేదని హైకోర్టు పేర్కొంది.
కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశం వర్తించదంటూ తెలిపింది. ఇది కార్పొరేషన్ ఆస్తి, వారికి ప్రార్థన చేసేందుకు రెండు రోజులు ఉన్నాయి. రంజాన్ , బక్రీద్. వాస్తవానికి జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
కాగా వినాయక చవితి వేడుకలను హుబ్బళ్లి లోని ఈద్గా మైదానంలో నిర్వహించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరు లోని ఈద్గా భూమిలో ప్రతిపాదిత వేడుకల విషయంలో యథాతథ స్థితిని సుప్రీంకోర్టు ఆదేశించింది.
దీంతో అంజుమన్ -ఎ-ఇస్లాం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో(Supreme Court) సవాల్ చేసింది.
స్థలం అనేది అందరికీ సంబంధించినది. కానీ ఒకరి మతానికి చెందిన వారే వాడుకోవాలని రూల్ ఏమీ లేదని సీరియస్ కామెంట్స్ చేసింది ధర్మాసనం.
Also Read : భారీ గెలుపుపై కన్నేసిన భారత్