Mukhtar Ansari : గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ అరెస్ట్
అదుపులోకి తీసుకున్న ఈడీ
Mukhtar Ansari : మనీ లాండరింగ్ కేసులో యుపీ గ్యాంగ్ స్టర్ , పేరొందిన పొలిటికల్ లీడర్ ముఖ్తార్ అన్సారీని(Mukhtar Ansari) బుధవారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేసింది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్ లోని బండా జైలులో ఉన్నారు. గత ఏడాది ఈ కేసులో 59 ఏళ్ల వయస్సు ఉన్న ముఖ్తార్ అన్సారీని ప్రశ్నించింది.
ఇప్పటి వరకు అతడిపై 49 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. యూపీలోని స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు తెలిపింది.
ఏజెన్సీ తరలించిన ప్రొడక్షన్ వారెంట్ ఆధారంగా ప్రయాగ్ రాజ్ లోని కోర్టులో హాజరు పర్చిన తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) క్రిమినల్ సెక్షన్ల కింద దర్యాప్తు ఏజేన్సీ ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
ఆయన కుమారుడు ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీని కూడా నవంబర్ లో ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ప్రయాగర్ రాజ్ లోని సబ్ జోనల్ కార్యాలయంలో ప్రశ్నించింది. ఆ తర్వాత అరెస్ట్ చేసింది. దీని తర్వాత ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari)బావ అతిఫ్ రజాను కూడా అదుపులోకి తీసుకుంది.
ఈ మొత్తం ఫ్యామిలీకి పెద్ద ఎత్తున నేర చరిత్ర ఉంది. ముఖ్తార్ అన్సారీకి సంబంధించి భార్య, ఇద్దరు అన్నదమ్ములు నడుపుతున్న వికాస్ కన్ స్ట్రక్షన్ అనే కంపెనీపై కేసులు నమోదు చేసింది. వీటి ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
Also Read : చర్చించేందుకు ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా