Tillu Tajpuriya : తీహార్ జైలులో గ్యాంగ్ స్టర్ టిల్లు హత్య
ఢిల్లీ కోర్టు కాల్పుల్లో నిందితుడు
Tillu Tajpuriya : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కోర్టు కాల్పుల్లో నిందితుడైన గ్యాంగ్ స్టర్ టిల్లు తాజ్ పురియాను(Tillu Tajpuriya) తీహార్ జైలులో ప్రత్యర్థులు హతమార్చారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. టిల్లు తాజ్ పురియా అలియాస్ సునీల్ మాన్ ను గ్యాంగ్ స్టర్ యోగేష్ తుండా, అతడి సహాయకులు ఇనుప రాడ్ లతో జైలులో దాడికి పాల్పడ్డారు.
దాడి చేసిన వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న టిల్లు తాజ్ పురియాను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేక పోయింది. ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన తీహార్ జైలులో గ్యాంగ్ స్టర్ దాడికి గురి కావడం కలకలం రేపింది. స్పష్టంగా భద్రతా లోపం కనిపించింది. ఈ దాడిలో మరో ఖైదీ రోహిత్ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ప్రాణా పాయం నుండి బయట పడినట్లు తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి యోగేష్ తుండా, దీపక్ తీటర్ , రియాజ్ ఖాన్ , రాజేష్ జైలు మొదటి అంతస్తులో ఉన్న వారి వార్డులోని ఇనుప గ్రిల్స్ ను పగులగొట్టారు.
ఇతర ముఠా సభ్యులతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్ వార్డులో ఉంచిన టిల్లు తాజ్ పురియాపై(Tillu Tajpuriya) రాడ్ లతో దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా 2021 లో రోహిణి కోర్టుకు హాజరైన గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టిల్లు ప్రధాన కుట్రదారుగా ఉన్నారు.
Also Read : నాలో అంత లైంగిక సామర్థ్యం ఉందా