Punjab Encounter : పంజాబ్ లో గ్యాంగ్ స్ట‌ర్లు ఎన్ కౌంట‌ర్

సిద్దూ మూసే వాలా కేసులో అనుమానితుడు

Punjab Encounter : ప్ర‌ముఖ పంజాబ్ గాయ‌కుడు సిద్దూ మూసే వాలా హ‌త్య కేసులో అనుమానితుడు మృతి చెందాడు. అమృత్ స‌ర్ కు 20

కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న భ‌క్నా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

జ‌గ్రూప్ సింగ్ రూప , మ‌న్ ప్ర‌త్ సింగ్ అలియాస్ మ‌న్ను కుసా అనే ఇద్ద‌రు గ్యాంగ్ స్ట‌ర్ ల‌ను పంజాబ్ పోలీస్ యాంటీ గ్యాంగ్ స్ట‌ర్ టాస్క్ ఫోర్స్ తుద‌ముట్టించింది. గ్యాంగ్ స్ట‌ర్ల‌కు పోలీసుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

మ‌న్ ప్రీత్ సింగ్ అలియాస్ మ‌న్ను కుస్సా జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు గాయ‌ప‌డ్డారు. ఒక వార్తా ఛానెల్ కు చెందిన కెమెరా ప‌ర్స‌న్

కూడా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ప‌రారీలో ఉన్న ముగ్గురు షూట‌ర్ల‌లో(Punjab Encounter) వారు కూడా ఉన్నారు.

వీరిలో దీప‌క్ ముండి జాడ ఇంకా తెలియ రాలేదు. మిగిలిన వారిలో ఎనిమిది మంది షూట‌ర్లు ఉన్నార‌ని వారిని అరెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.

కాగా జ‌గ్రూప్ సింగ్ రూప‌, మ‌న్ ప్రీత‌స్ సింగ్ అలియాస్ మ‌న్ను కుస్సా ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన త‌ర్న్ త‌రేన్ లోని గ్రామాల‌కు చెందిన వారు.

పాకిస్తాన్ స‌రిహ‌ద్దు నుండి కేవ‌లం 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని చుట్టు ముట్టారు.

గాయ‌కుడు, పాట‌ల ర‌చ‌యిత , రాప‌ర్ తో పాటు కాంగ్రెస్ నాయ‌కుడైన శుధ దీప్ సింగ్ సిద్దూ అలియాస్ సిద్దూ మూసే వాలా(Sidhu Moose Wala) ను

గ‌త మే 20న పంజాబ్ లోని మాన్సా జిల్లా లోని మూసా గ్రామం స‌మీపంలో కాల్చి చంప‌బ‌డ్డాడు.

కెన‌డాకు చెందిన స‌తీంద‌ర్ జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ తో ఈ హ‌త్య‌కు ప్లాన్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. అకాలీ నాయ‌కుడు విక్కీ మిద్దు ఖేరా హ‌త్య‌కు ప్రతీకారంగానే మ‌ట్టు పెట్టిన‌ట్లు స‌మాచారం.

Also Read : మాదే అస‌లైన శివ‌సేన – షిండే

Leave A Reply

Your Email Id will not be published!