Botsa Satyanarayana : బొత్స కామెంట్స్ కలకలం
తెలంగాణలో భగ్గుమంటున్ననేతలు
Botsa Satyanarayana : త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మరోసారి తెలంగాణ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు మరింత ఆజ్యం పోసే ప్రయత్నం చేశారు ఏపీ విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana). ఆయన తెలంగాణలో విద్యా వ్యవస్థపై నిప్పులు చెరిగారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందన్నారు. కనీసం పోస్టులను భర్తీ చేయలేని స్థితిలో కూరుకు పోయారంటూ ఆరోపించారు. దీంతో బొత్స సత్యనారాయణ చేసిన తాజా కామెంట్స్ తెలంగాణలో కలకలం రేపుతున్నాయి.
చూచి రాతలు, కుంభ కోణాలకు తెలంగాణ కేరాఫ్ గా మారడం దారుణమన్నారు బొత్స సత్యనారాయణ. చివరకు టీచర్ల బదిలీలు కూడా చేసుకోలేని స్థితిలో ఉందంటూ ఎద్దేవా చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు మంత్రి గంగుల కమలాకర్. తమ వైపు తప్పులు పెట్టుకుని మా వారిని అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందని, తప్పు చేసిన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు గంగుల.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇంకా విషం కక్కుతున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో బొత్స పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని , ప్రవర్తించారని గుర్తు చేశారు తెలంగాణ మంత్రి.
Also Read : Penipe Viswarup : ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధిక పెన్షన్