Gannavaram TDP Pattabhi : గన్నవరంలో గరం గరం
రోజంతా హైడ్రామా
Gannavaram TDP Pattabhi : ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులకు దిగుతున్నారు. తెలుగుదేఃం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిని గన్నవరం(Gannavaram TDP Pattabhi) పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు పోలీసులు. తెల్లవారుజామున 3 గంటలకు స్టేషన్ కు తీసుకు వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అంతకు ముందు పట్టాభిని ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స అనంతరం మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకు వెళ్లారు. అక్కడ గంటకు పైగా వేచి ఉన్నారు. దీంతో రాత్రి నుంచి పొద్దుటి దాకా హై డ్రామా చోటు చేసుకుంది.
జడ్జి ఇంటి ముందు పోలీసు వాహనంలోనే వేచి ఉన్నారను. పట్టాభికి సంబంధించిన ఆరోగ్య నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు. జడ్జి ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ కేసుకు సంబంధించి పట్టాభితో పాటు పాల్గొన్న మరో 10 మందిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. పట్టాభి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది కోర్టు. పోలీసులు తనను తీవ్రంగా కొట్టారంటూ పట్టాభి(Gannavaram TDP Pattabhi) సంచలన ఆరోపణలు చేశారు.
అంతకు ముందు తన భర్త ఎక్కడున్నాడో ఆచూకి తెలుపాలంటూ భార్య ఆందోళనకు దిగడంతో మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమెను వెళ్లనీయకుండా హౌస్ అరెస్ట్ చేశారు.
కనీసం తన భర్తతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించాలంటూ కోరారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు పట్టాభి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై కాకుండా తమ వారిపై కేసులు నమోదు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : స్నూపింగ్ కేసులో సిసోడియాపై విచారణ