Garuda Panchami TTD : తిరుమలలో గరుడ పంచమి
రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య
Garuda Panchami TTD : పవిత్రమైన పుణ్య క్షేత్రం దేవ దేవుడు శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో గరుడ పంచమిని ఘణంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆగస్టు మాసంలో గరుడ పంచమి పర్వదినం సందర్భంగా గరుడ పంచమిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Garuda Panchami TTD Will Start
ఇందులో భాగంగా తిరుమలలో ఆగస్టు 21న సోమవారం గరుడ పంచమిని పురస్కరించుకుని రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారు తనకు ఇష్ట వాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. భక్తులకు అనుగ్రహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ నెలలో స్వామి వారు గరుడునిపై రెండవ సారి గరుడ వాహనంపై దర్శనం ఇస్తుండడం విశేషం.
కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా, సంతోషకరంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడుని లాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడ పంచమిపూజ చేస్తారని కథ ఉంది. ఇప్పటికే టీటీడీ స్వామి వారు ఊరేగేందుకు అద్భుతంగా ఏర్పాట్లు చేసింది.
Also Read : Minister KTR Invited : కేటీఆర్ కు అంతర్జాతీయ ఆహ్వానం