Gautam Adani Loss : ఆవిర‌వుతున్న సంప‌ద‌తో ఆగ‌మాగం

22వ స్థానానికి ప‌డి పోయిన గౌతం అదానీ

Gautam Adani Loss :  హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ గ్రూప్ కొట్టిన దెబ్బ‌కు అదానీ గ్రూప్ కంపెనీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. భారీ ఎత్తున షేర్లు ప‌డి పోతున్నాయి. నిన్న‌టి దాకా కుబేరుల జాబితాలో 2వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌతం అదానీ(Gautam Adani Loss) ఏకంగా 22వ స్థానానికి ప‌డిపోయాడు. ఇక ఎప్ప‌టి లాగే రిల‌య‌న్స్ గ్రూప్ చైర్మ‌న్ ముకేశ్ అంబానీ మాత్రం త‌న స్థానం ప‌డి పోకుండా కాపాడుకుంటూ వ‌స్తున్నాడు.

ఇప్ప‌టికే ఆర్బీఐ సైతం అదానీ గ్రూప్ తీసుకున్న రుణాల వివ‌రాలు ఇవ్వాల‌ని బ్యాంకుల‌ను ఆదేశించింది. రోజు రోజుకు పేక మేడ‌లా ఆస్తి క‌రిగి పోతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన బిగ్ స్కాం మ‌రోసారి గుర్తుకు వ‌చ్చేలా చేసింది. స‌త్యం రామ‌లింగ రాజు ప్ర‌స్తుతం ఉన్న దానికంటే ఎక్కువ చూపించి బురిడీ కొట్టించి జైలులో ఉన్నాడు.

ఇదే స‌మ‌యంలో బీజేపీకి చెందిన మాజీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి అయితే ఏకంగా మోదీని టార్గెట్ చేశాడు. వెంట‌నే అదానీ ఆస్తుల‌ను స్వాధీనం చేసుకోవాల‌ని డిమాండ్ చేశాడు. ఆపై ఆస్తుల‌ను వేలానికి పెట్టాల‌ని కోరాడు. బ్లూమ్ బెర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ లో 21వ స్థానానికి ప‌డి పోయింది అదానీ గ్రూప్ . కంపెనీ నిక‌ర విలువ‌లో మ‌రింత క్షీణ‌త క‌నిపిస్తోంది.

ఇదిలా ఉండ‌గా ముకేశ్ అంబానీ ఆస్తుల విల‌వు 82. 2 బిలియ‌న్ డాల‌ర్లు గా ఉంటే గౌతం అదానీ సంప‌ద 61.3 బిలియ‌న్ల‌కు ప‌డి పోయింది. ఇక టాప్ లో బెర్నార్ల్ ఆర్నాల్డ్ ఉండ‌గా ఎలోన్ మ‌స్క్ రెండో స్థానంలో నిలిచాడు.

Also Read : అదానీ ఆస్తుల‌ను జాతీయం చేయండి

Leave A Reply

Your Email Id will not be published!