Gautam Navlakha : వీడిన చెరసాల గృహ నిర్బంధానికి నవ్లాఖా
ఎల్గార్ పరిషద్ కేసులో గౌతమ్ నిందితుడు
Gautam Navlakha : రెండేళ్ల జైలు జీవితం అనంతరం ఎట్టకేలకు విముక్తి లభించింది ప్రముఖ ఉద్యమకారుడు, హక్కుల నేత గౌతమ్ నవ్లాఖాకు. ఎల్గార్ పరిషద్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. నిషిద్ద మావోయిస్టు సంస్థతో సంబంధాలు ఉన్నాయని, పాకిస్తాన్ ఐఎస్ఐతో కూడా లింకు ఉందంటూ ఆరోపణలు ఉన్నాయి.
ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదలయ్యారు నవ్లాఖా. 2020 ఏప్రిల్ నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగోలేదని గృహ నిర్బంధంలో ఉంచాలని ఎన్ఐఏను భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించింది. కానీ ఎన్ఐఏ అమలు చేయలేదు.
మరోసారి గౌతమ్ నవ్లాఖా విడుదలపై విచారణ జరిగింది. ఆయనకు లింకులు ఉన్నాయన్నది వాస్తవమని,, కొన్నింటిని ఆయన దాచి పెడుతున్నాడంటూ ఎన్ఐఏ ఆరోపించింది. ఎన్ఐఏ తరపున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ చేసిన వాదనలను తోసి పుచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇందు వల్లనే గౌతమ్ నవ్లాఖాను(Gautam Navlakha) విడుదల చేయలేదని తెలిపారు.
ఇందుకు సంబంధించి విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశించిన ఉత్తర్వులను అమలు చేయకుండా ఉండడం, లోపాలను వెతికి చూపుతూ పోతే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.
వెంటనే నవ్లాఖాను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో గత్యంతరం లేక ఎన్ఐఏ ఆయనను గృహ నిర్బంధానికి తరలించింది. నవంబర్ 10న ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. మరో వైపు గౌతమ్ నవ్లాఖాకు మావోయిస్టులతో, ఐఎస్ఐ తో లింకులు ఉన్నట్లు నిరూపించే ఆధారాలు సమర్పించక పోవడం విశేషం.
Also Read : కాంగ్రెస్ లో ప్రక్షాళన అవసరం – జగ్గారెడ్డి