Geetanjali Shree : గీతాంజలి శ్రీకి బుకర్ ప్రైజ్
టూంబ్ ఆఫ్ శాండ్ నవల
Geetanjali Shree : ప్రపంచ వ్యాప్తంగా సాహిత్య పరంగా ఎంతో గౌరవంగా , ఉన్నతంగా భావించే బుకర్ ప్రైజ్ భారత దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీకి దక్కింది. ఆమె హిందీలో రాసిన టూంబ్ ఆఫ్ శాండ్ నవలకు ఈ పురస్కారం లభించింది.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో హిందీలో రాసిన ఏ పుస్తకానికి ఇప్పటి వరకు బుకర్ ప్రైజ్ దక్కలేదు. ఇదే మొదటిసారి కావడం విశేషం. తొలి హిందీ నవలగా చరిత్ర సృష్టించింది టూంబ్ ఆఫ్ శాండ్ నవల.
విచిత్రం ఏమిటంటే ఇది ఆమె రాసిన పుస్తకానికి అనువాదం. 2018 సంవత్సరంలో గీతాంజలి శ్రీ(Geetanjali Shree) రెట్ సమాధి పేరుతో హిందీలో నవల రాశారు.
దీనిని అమెరికాకు చెందిన ప్రసిద్ద అనువాదకురాలు (ట్రాన్స్ లేటర్ ) టూంబ్ ఆఫ్ శాండ్ పేరుతో ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. దీనిని విడుదల చేసిన కొన్ని రోజులకే భారీ ఎత్తున ఆదరణ లభించింది.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది ఈ పుస్తకానికి. దీంతో గీతాంజలి శ్రీ(Geetanjali Shree) ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఇక ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మకైన బుకర్ ప్రైజ్ కు టూంబ్ ఆఫ్ శాండ్ ను పరిశీలనకు తీసుకున్నారు.
ఏకంగా 2022 సంవత్సరానికి గీతాంజలి శ్రీకి బుకర్ ప్రైజ్ ప్రకటించినట్లు న్యాయ నిర్ణేతల కమిటీ ప్రకటించింది. ట్రాన్స్ లేటర్ డైసీ రాక్ వెల్ తో కలిసి 50 వేల పౌండ్లు నగదు ప్రైజ్ అందుకున్నారు గీతాంజలి శ్రీ.
కాగా ఈ పుస్తకం ఇప్పటికే ఇంగ్లిష్ పెన్ అవార్డు దక్కించుకుంది.
Also Read : దళిత సాహిత్యం ఎన్నో నేర్పింది