Manoj Pande : భారత త్రివిధ దళాధిపతిగా మనోజ్ పాండే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జనరల్ ఎం.ఎం. నరవాణే పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీ చీఫ్ గా పాండేను నియమించింది.
ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ గా పని చేస్తున్న మనోజ్ పాండేకు( Manoj Pande) కీలక పదవీ బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉండగా పాండే కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి త్రివిధ దళానికి నాయకత్వం వహించిన మొదటి అధికారి అయ్యాడు.
ఆర్మీ స్టాఫ్ 29వ చీఫ్ గా జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 1న ఆర్మీ వైస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టే కంటే ముందు సిక్కం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్ లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ని కాపాడే బాధ్యత కలిగిన తూర్పు ఆర్మీ కమాండ్ కు మనోజ్ పాండే( Manoj Pande)నాయకత్వం వహిస్తున్నారు.
భారత దేశం అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ పాండే త్రివిధ దళానికి నాయకత్వం వహిస్తుండడం విశేషం. వీటిలో వరుసగా పాకిస్తాన్, చైనాతో ఇప్పటికే భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఆర్మీ చీఫ్ గా థియేటర్ కమాండ్ లను రూపొందించే ప్రభుత్వ ప్లాన్ పై ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో సమన్వయం చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది.
గత ఏడాది డిసెంబర్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత దేశపు మొదటి చీఫ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ థియేటర్ల ప్లాన్ ను అమలు చేస్తుండే వారు. ప్రభుత్వం ఇంకా రావత్ వారసుడిని ఎంపిక చేయలేదు.
Also Read : కేంద్రం నిర్వాకం వల్లే బొగ్గు, విద్యుత్ కొరత