General Upendra Dwivedi: చైనా, పాక్‌ సంబంధాలపై ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు

చైనా, పాక్‌ సంబంధాలపై ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు

Upendra Dwivedi : భారత్‌ కు వ్యతిరేకంగా చైనా, పాకిస్థాన్‌ లు కుమ్మక్కవుతున్నాయని ఆర్మీ చీఫ్ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటి మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలున్నాయన్న వాస్తవాన్ని భారత్‌ తప్పక అంగీకరించాలన్నారు. ఈ కారణంగా పశ్చిమం, ఉత్తరం..రెండు దిక్కులా దాడిని ఎదుర్కొవాల్సిన ముప్పు ఏర్పడిందని తెలిపారు. ఈ మేరకు ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సైనిక సన్నద్ధత, సరిహద్దుల వెంబడి పరిస్థితులు, బంగ్లాదేశ్‌ అంశం తదితరాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

Upendra Dwivedi Comment

ఈ కార్యక్రమంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాల గురించి జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) ప్రస్తావిస్తూ.. ‘‘ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రబిందువు. అందువల్ల మనకు పొరుగునున్న ఏ దేశంతోనైనా ఆ దేశం సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం మనకు ఆందోళనకరం. ఇందుకు కారణం… ఆ దేశాన్ని కూడా ఉగ్రవాద చర్యలను ఉపయోగించుకునే అవకాశం ఉండటమే’’ అని ద్వివేది పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ పొరుగుదేశం నుంచి ఉగ్రవాదుల రాక ఏమీ తగ్గలేదని చెప్పారు. వారి రాక పెరగనుందని, పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘‘గత ఏడాది పట్టుబడిన ఉగ్రవాదుల్లో 60 మంది పాకిస్థాన్‌ మూలాలు ఉన్నవారే. అందువల్ల పొరుగు దేశం నుంచి ఇంకా ముప్పు తొలగిపోలేదు’’ అని ఆయన వివరించారు. దేశంలో ప్రస్తుతం ‘యుద్ధమూ లేదు… శాంతీ లేదు’ అన్నట్లుగా పరిస్థితి ఉందని అన్నారు.

బంగ్లాదేశ్‌ కు సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటవుతుందన్నారు. అయితే భారత్‌-బంగ్లాదేశ్‌ ల మధ్య సైనిక బంధం బలంగానే ఉందని చెప్పారు. చైనా, పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక బంధం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… ‘‘వర్చువల్‌ వేదికలపై ఆ రెండు దేశాల మధ్య బంధం వందశాతంగా ఉంది. భౌతికంగా పరిశీలిస్తే… పాక్‌ వద్ద ఉన్న ఆయుధాలన్నీ చైనాలో తయారైనవే. చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్‌ వినియోగిస్తోంది. కుమ్మక్కుకు సంబంధించి నేడున్న పరిస్థితి ఇది. దీన్నిబట్టి రెండువైపుల నుంచి ఏకకాలంలో మనకు యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవం’’ అని ఆర్మీ చీఫ్‌ పేర్కొన్నారు.

Also Read : Chandrababu Naidu: తన హెల్త్ సీక్రెట్ ను బయటపెట్టిన సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!