GFST Summit : 17న జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో సదస్సు
డీప్ టెక్నాలజీ అనే అంశంపై సదస్సు
GFST Summit : గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ ఫార్మేషన్ (జీఎఫ్ఎస్టీ ) ఆధ్వర్యంలో జూన్ 17న శనివారం హైదరాబాద్ లో డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై సదస్సు జరగనుంది. ఈ సదస్సులో జీఎఫ్ఎస్టీ చైర్మన్ గా ఉన్నారు మాజీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనను్నారు. ఈ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థగా పని చేస్తోంది. ఇది మూడేళ్ల కిందట ఏర్పాటైంది.
దీనిలో ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ , ఐపీఎస్ ఆఫీసర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన ఆఫీసర్లు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు ఉన్నారు. పాలసీల రూపకల్పన, పరిశోధన, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలకు జీఎఫ్ఎస్టీ వేదికగా పని చేస్తోంది.
ఇదిలా ఉండగా మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్ , తయారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ , టెక్నాలజీ, స్టార్ట్ అప్ ఎకో సిస్టమ్ , వాతావరణ మార్పులు, ప్రజా ఆరోగ్యం వంటి అంశాలపై జీఎఫ్ఎస్టీ పని చేస్తోంది. ఇండియా స్వాతంత్రం సిద్దించి వందేళ్లు పూర్తి చేసుకునే 20247 నాటికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా రూపు దిద్దుకునే ఛాన్స్ ఉంది.
ఇందులో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా @100 అనే కాన్సెప్ట్ పై జీఎఫ్ఎస్టీ పని చేస్తోంది. మూడు అంశాలపై నిపుణులతో సదస్సులు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ లో లాజిస్టిక్స్ , డిసెంబర్ లో ఫార్మా్ అండ్ హెల్త్ కేర్ పై సమావేశాలు జరగనున్నాయి.
Also Read : MK Stalin Fight : సీఎం ధిక్కార స్వరం