Ghulam Nabi Azad : సోనియాకు గులాం న‌బీ ఆజాద్ ఝ‌ల‌క్

పార్టీ ప‌ద‌వులకు సీనియ‌ర్ నేత గుడ్ బై

Ghulam Nabi Azad : వ‌రుస షాక్ ల‌తో స‌త‌మ‌తం అవుతున్న సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి గులాం న‌బీ ఆజాద్(Ghulam Nabi Azad) ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి ఝ‌ల‌క్ ఇచ్చారు.

జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పార్టీ త‌ర‌పున ప్ర‌చార క‌మిటీ చీఫ్‌గా నియ‌మించింది. అయితే అందుకు గులాం న‌బీ ఆజాద్ నిరాక‌రించారు.

అంతే కాకుండా మ‌రో కీల‌క ప‌ద‌విలో కొలువు తీరిన ఆజాద్ పార్టీకి చెందిన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ నుంచి కూడా త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పార్టీని విస్తు పోయేలా చేశారు. ప్ర‌ధానంగా గ‌త కొన్నేళ్ల నుంచి ఆజాద్ వేరు కుంప‌టి పెట్టారు. కాంగ్రెస్ లో అసంతృప్తి నేత‌ల‌ను ఒక తాటి పైకి తీసుకు వ‌చ్చారు.

ఆపై వారితో క‌లిసి ఓ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఒక ర‌కంగా కొత్త నాయ‌క‌త్వంపై గుర్రుగా ఉన్నారు. ఒకానొక స‌మ‌యంలో గులాం న‌బీ ఆజాద్ భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతార‌ని భావించారు.

అనూహ్యంగా ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని పొడిగిస్తార‌ని భావించారు. కానీ మేడం త‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించ‌లేదు. ఇదే స‌మ‌యంలో పార్టీలో రోజు రోజుకు అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్ర‌ధానంగా పార్టీలో అత్యంత సీనియ‌ర్ అయిన త‌న‌కు ప‌ద‌వి ప‌రంగా పొడిగింపు ద‌క్క‌క పోవ‌డంపై గుర్రుగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక త‌న‌కు ఆప్తుడైన అహ్మెద్ మిర్ ను తొలగించ‌డం కూడా ఇందుకు కార‌ణంగా తోస్తోంది.

Also Read : బీహార్ పై కాషాయం మేధోమ‌థ‌నం

Leave A Reply

Your Email Id will not be published!