BJP Bihar Strategy : బీహార్ పై కాషాయం మేధోమ‌థ‌నం

ర్యాలీలు..ఆందోళ‌న‌ల‌కు శ్రీ‌కారం

BJP Bihar Strategy : బీహార్ లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారి పోయాయి. జేడీయూ చీఫ్‌, సీఎం నితీశ్ కుమార్ కోలుకోలేని షాక్ ఇచ్చారు బీజేపీకి. జేడీయూ, కాషాయ పార్టీ క‌లిసి 17 ఏళ్ల పాటు కొలువు తీరాయి రాష్ట్రంలో.

కానీ ఎప్పుడైతే ట్ర‌బుల్ షూట‌ర్, కేంద్ర హోం శాఖ మంత్రి పాట్నాలో ఎంట్రీ ఇచ్చారో ఆనాటి నుంచి నితీశ్ కుమార్ క‌న్నెర్ర చేశారు. ఉన్న‌ట్టుండి బీజేపీకి క‌టీఫ్ చెప్పారు.

ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో జ‌త క‌ట్టారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల‌తో మ‌హా కూట‌మిగా ఏర్ప‌డి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎనిమిదవ సారి సీఎంగా కొలువు తీరారు నితీశ్ కుమార్.

ఈ త‌రుణంలో అనుకోని రీతిలో ఝ‌లక్ ఇచ్చిన నితీశ్ కుమార్ కు ఎలాగైనా షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు బీజేపీ చీఫ్ న‌డ్డా, అమిత్ షా. ఈ ఇద్ద‌రి ఆధ్వ‌ర్యంలో మేధోమ‌ధ‌నం జ‌రిగింది.

రాష్ట్రంలో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బీజేపీ ఎలాంటి వ్యూహాలు(BJP Bihar Strategy) అనుస‌రించాల‌నే దానిపై చ‌ర్చ జ‌రిగింది. ర్యాలీలు , ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు.

బీజేపీతో పాటు లోక్ జ‌న శ‌క్తి పార్టీ కూడా హాజ‌రైంది. రాష్ట్రంలో అగ్ర‌వ‌ర్ణాల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని సీనియ‌ర్లు సూచించారు. ఇదిలా ఉండ‌గా నితీశ్ కుమార్ ఒక్క ప‌శుప‌తి ప‌రాస్ వ‌ర్గాన్ని మాత్ర‌మే బీజేపీకి వ‌దిలి వేశాడు.

మిగ‌తా పార్టీల‌ను త‌న‌తో క‌లుపుకున్నాడు. ఇక అక‌స్మాత్తుగా విప‌క్షాల క‌ల‌యిక కాషాయాన్ని ఒంట‌రిని చేసింది. యాదవేత‌ర ఓబీసీలు, ద‌ళితులు, యాద‌వులు, ముస్లింలు మ‌హా ఘ‌ట్ బంధ‌న్ కు దూరంగా ఉన్నార‌ని వారికి చేరువ కావాల‌ని నిర్ణ‌యించారు.

Also Read : సోనియాకు గులాం న‌బీ ఆజాద్ ఝ‌ల‌క్

Leave A Reply

Your Email Id will not be published!