Elon Musk : మాంచెస్ట‌ర్ యునైటెడ్ ను కొనుగోలు చేస్తా

టెస్లా సిఇఓ ఎలోన్ మ‌స్క్ ట్వీట్ గంద‌ర‌గోళం

Elon Musk : నిత్యం ఏదో ఒక అంశాన్ని ప్ర‌స్తావించ‌డం వైర‌ల్ గా మార‌డం టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్(Elon Musk)  కు అల‌వాటుగా మారింది. విచిత్రం ఏమిటంటే ఒక్కోసారి ఆయ‌న చేస్తున్న ట్వీట్లు గంద‌ర‌గోళానికి దారితీస్తున్నాయి.

అయోమ‌యంలో ప‌డేస్తున్నాయి. దీంతో నెటిజ‌న్లు, అభిమానులు ఎలోన్ మస్క్ కు ఏమైందంటూ ప్ర‌శ్నిస్తున్నారు. విచిత్రం నిన్న మొన్న‌టి దాకా సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతున్న అమెరికాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేస్తానంటూ ప్ర‌క‌టించాడు.

$44 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు ఒప్పందం కూడా చేసుకున్నాడు. ఏమైందో ఏమో కానీ సంస్థ‌పై అభాండాలు మోపాడు, ఆపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు.

ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి తాను ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేయ‌డం లేదంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పాడు. దీంతో ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం కోర్టును ఆశ్ర‌యించింది.

త‌మ‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కాక త‌మ సంస్థ ప‌రువుకు భంగం క‌లిగించేలా చేసిన ఎలోన్ మ‌స్క్ త‌మ‌కు న‌ష్ట ప‌రిహారం ఇవ్వాలంటూ కోరింది.

దీనిపై విచార‌ణ జ‌రుగుతోంది. అయితే తాను అడిగిన వివ‌రాలు ఇవ్వ‌లేదంటూ ఆరోపించాడు ఎలోన్ మ‌స్క్. తాజాగా మ‌రో వివాదానికి, గంద‌ర‌గోళానికి తెర తీశాడు

ఈ దిగ్గ‌జ వ్యాపార‌వేత్త‌. అదేమిటంటే తాజాగా చేసిన ట్వీట్ లో తాను మాంచెస్ట‌ర్ యునైటెడ్ ను కొనుగోలు చేస్తానంటూ ప్ర‌క‌టించాడు. అదేమైనా వ‌స్తువా కొనుగోలు చేసేందుకు అస‌లు ఎలోన్ మ‌స్క్(Elon Musk)  కు ఏమైందంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Also Read : $4 బిలియ‌న్ల స్టాక్ హోల్డింగ్స్ పై ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!