MK Stalin DMK : సుప్రీం ఉచితాల తీర్పుపై డీఎంకే స‌వాల్

ఉన్న‌త న్యాయ స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు

MK Stalin DMK : భార‌త‌దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఉచిత ప‌థ‌కాల‌పై చేసిన కామెంట్స్ , ఇచ్చిన తీర్పుపై త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు కాంగ్రెస్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

విద్య‌, వైద్యం పౌరుల ప్రాథ‌మిక హ‌క్కు అని దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్ల‌యినా నేటికీ ఇంకా 60 శాతానికి పైగా పేద‌లు ఉన్నార‌ని పేర్కొన్నారు. ప్రాథ‌మిక సూత్రాల‌ను అమ‌లు చేయ‌డం ప్ర‌భుత్వాల క‌నీస ధ‌ర్మ‌మే కాదు బాధ్య‌త కూడా అని స్ప‌ష్టం చేశారు.

అయితే దేశ ప్ర‌ధాన మంత్రి ఉచిత ప‌థ‌కాల వ‌ల్ల దేశం అధోగ‌తి పాల‌వుతోంద‌ని ఆరోపించారు. కాగా ఆప్ మాత్రం బ‌డా బాబులు, వ్యాపార‌వేత్త‌లు, అక్ర‌మార్కులు, ఆర్థిక నేర‌గాళ్లు కొల్ల‌గొట్టిన డ‌బ్బులు, తీసుకున్న రుణాలు రూ. 10 ల‌క్ష‌ల కోట్ల‌ను మాఫీ ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించింది.

దీనికి కేంద్రం నుంచి కానీ ప్ర‌ధాన మంత్రి మోదీ నుంచి కానీ స‌మాధానం లేదు. ఇక మోదీ, సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ చేసిన ఉచితాల కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin).

ఈ మేర‌కు త‌న సార‌థ్యంలోని డీఎంకే త‌ర‌పున ఉచితాల నిర్వ‌చనాన్ని స‌వాల్ చేసింది సుప్రీంకోర్టులో. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీల‌కు అతీతంగా ఉచితాల‌ను ఉప‌యోగించ‌డం సాంప్ర‌దాయంగా ఉన్న రాష్ట్రాల‌లో త‌మిళ‌నాడు ఒక‌టి.

ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి కొన్నిసార్లు ప్ర‌జ‌ల‌కు బ‌ట్ట‌లు, ఆహారం, గృహోప‌క‌రణాలు పంపిణీ చేశాయి పార్టీలు. బీజేపీకి చెందిన అశ్విని ఉపాధ్యాయ్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ లోని వైఖ‌రిని స‌వాల్ చేసింది.

స్టాలిన్ త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల కోసం కిలో రూపాయికే బియ్యం, పేద‌ల ఇళ్ల‌కు ఉచితంగా క‌ల‌ర్ టెలివిజ‌న్ సెట్లు, మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్ పాస్ లు స‌హాల అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టింది.

Also Read :  బీహార్ పై కాషాయం మేధోమ‌థ‌నం

Leave A Reply

Your Email Id will not be published!