Gidugu Rudraraju : ఏపీ కాంగ్రెస్ లోకి ష‌ర్మిల

ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్ర‌రాజు

Gidugu Rudraraju : అమ‌రావ‌తి – త్వ‌ర‌లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో రాజ‌కీయాలు విప‌రీతంగా మారుతున్నాయి. ఇప్ప‌టి దాకా త‌న‌కంటూ ఎదురే లేద‌ని అనుకుంటున్న వైసీపీ బాస్ , సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నాయి ప్ర‌తిప‌క్షాలు.

Gidugu Rudraraju Comments

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వ‌చ్చింది. ఏఐసీసీ పూర్తిగా స‌ర్వాధికారాలు అప్ప‌గించ‌డంతో రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు. ఇక తెలంగాణ‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌.

ఆమె పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ , ఆయ‌న కుటుంబంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చింది. చివ‌ర‌కు ఆమె ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతాన‌ని ప్ర‌క‌టించింది. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా తాను పోటీ చేయ‌డం లేదంటూ వెల్ల‌డించింది వైఎస్ ష‌ర్మిల‌.

అయితే అనూహ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి ష‌ర్మిల వ‌స్తారంటూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్ర‌రాజు(Gidugu Rudraraju). ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతోంది.

Also Read : Alla Ramakrishna Reddy : వైసీపీకి షాక్ ఎమ్మెల్యే రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!