Gina Raimondo : మోదీ ప్రత్యేకమైన నాయకుడు
అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో
Gina Raimondo : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఆయన అత్యంత జనాదరణ కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో(Gina Raimondo) గత మార్చి నెలలో భారత్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కీలకమైన వ్యాఖ్యలు చేశారు పీఎంపై.
నరేంద్ర మోదీతో చాలా సేపు సమావేశం కావడం జరిగింది. ఈసందర్బంగా ఎన్నో కీలక అంశాలు చర్చకు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రధానమంత్రికి టెక్నాలజీ పట్ల ఉన్న మక్కువ, అవగాహనను చూసి తాను విస్తు పోయానని స్పష్టం చేశారు గినా రైమోండో. కృత్రిమ మేధస్సు (ఏఐ) , మెషిన్ లెర్నింగ్ , సైబర్ సెక్యూరిటీ, ఇంటెర్నిట్ కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ , తదితర ప్రధాన అంశాలపై చర్చించామని తెలిపారు.
మోదీతో జరిగిన మీటింగ్ కు సంబంధించి అమెరికా లోని ఇండియా హౌస్ లో జరిగిన రిసెప్షన్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో జరిగిన సంభాషణ, చర్చలు , అంశాలు తాను మరిచి పోలేనని పేర్కొన్నారు గినా రైమోండో. నరేంద్ర మోదీ అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి అని తెలిపారు.
Also Read : యూపీలో రెడ్ అలర్ట్ – సీఎం