Girija Shetkar : టికెట్ ఇస్తే సరి లేకుంటే పోటీకి రెడీ
సురేష్ షెట్కార్ కూతురు గిరిజా షెట్కార్
Girija Shetkar : నారాయణఖేడ్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల వ్యవహారం గందరగోళానికి దారి తీసింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను ప్రకటించింది ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ. టికెట్లు రాని వాళ్లు నిప్పులు చెరుగుతున్నారు. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగుర వేస్తున్నారు.
Girija Shetkar Serious Comments
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకమైన పాత్ర పోషించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సురేష్ షెట్కార్. ఆయన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు. తాజాగా రెండో జాబితాను ఖరారు చేసే పనిలో పడింది.
ఇక అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ 119 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. బి ఫారమ్ లు కూడా ఇచ్చేశారు. తాజాగా నారాయణ్ ఖేడ్ టికెట్ విషయంపై ఇంకా అభ్యర్థి ఎవరనే దానిపై కొలిక్కి రాలేదు.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సురేష్ షెట్కార్ టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. అయితే తనను కాదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అనుచరుడికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తుండడం కలకలం రేపింది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సురేష్ షెట్కార్ కూతురు డాక్టర్ గిరిజా షెట్కార్(Girija Shetkar). తన తండ్రికి కాదని టికెట్ ఇవ్వక పోతే తాను ఒంటరిగా బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పి తయారైంది ఈ టికెట్ వ్యవహారం.
Also Read : Jana Reddy : జానా రెడ్డి జాన్తా నై
