Giriraj Singh : కేంద్ర గ్రామీణాభివృద్ధి , పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత దేశంలో కాకుండా పాకిస్తాన్ లో శ్రీరామ నవమి ర్యాలీలు నిర్వహిస్తారా అంటూ ప్రశ్నించాడు.
గిరిరాజ్ సింగ్ జిన్నా మనస్తత్వానికి చెందిన వ్యక్తులు అంటూ ఆరోపించారు. మరో వైపు ఓవైసీ తరహా వ్యక్తులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామనవవి ఊరేగింపులపై వస్తున్న విమర్శలపై విరుచుకుపడ్డారు.
కొన్ని రాష్ట్రాలలో రామనవమి ఊరేగింపుల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు, రెచ్చగొట్టే ప్రకటన పరంపర, అరెస్టుల, కేసుల నమోదుతో ఆయా ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి.
ఈ తరుణంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh)చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపాయి. భారత దేశంలో గంగా జమున తహజీబ్ సంస్కృతి గురించి మాట్లాడడాన్ని తప్పు పట్టారు.
ఊరేగింపులపై నోరు పారేసుకుంటున్న వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ దేశంలో ఇక్కడ కాక పోతే పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ , బంగ్లాదేశ్ , ఇతర అరబ్ దేశాలలో నిర్వహిస్తారా అంటూ గిరిరాజ్ సింగ్(Giriraj Singh) ప్రశ్నించారు.
ఇతర దేశాలలో ర్యాలీలు చేపడితే అన్యాయంగా పరిగణిస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1947లో మత విభజన జరిగిందన్నారు. ఓవైసీ తరహా వ్యక్తులంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇప్పుడు ఎవరైనా ఊరేగింపుల గురించి చులకనగా మాట్లాడితే ఊరుకోబోమంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారికి ఈ దేశంలో ఉన్నంత స్వేచ్చ ఎక్కడా లేదన్నారు గిరిరాజ్ సింగ్.
Also Read : బీజేపీపై శివసేన ఆగ్రహం