Gudivada Amarnath : 2023లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్
రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాథ్ కామెంట్
Gudivada Amarnath : గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ వచ్చే ఏడాది 2023 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) ప్రకటించారు.
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ ప్రపంచ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఎఫ్ఏపీసీసీఐ) వార్షిక జనరల్ బాడీ (ఏజీఎం) సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇదిలా ఉండగా రెండేళ్ల కిందటే పెట్టుబడి సదస్సును నిర్వహించాల్సి ఉందన్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ గ్లోబల్ సదస్సు వాయిదా పడిందన్నారు.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచ పెట్టుబడుల సదస్సును నిర్వహించాలని ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని స్పష్టం చేశారు.
పారిశ్రామికవేత్తలను రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్లుగా సీఎం అభివర్ణించారని పేర్కొన్నారు. ఇండస్ట్రియలిస్టులు రాష్ట్రంలో సానుకూల మార్పు తీసుకు రాగలరన్న నమ్మకం తమకు ఉందన్నారు.
చాలా మంది పారిశ్రామికవేత్తలు మారాలని తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath). ఎఫ్ఎపీసీసీఐ సభ్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
త్వరలో మహిళా పారిశ్రామికవేత్తల పార్కును కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ఇతర జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి.
చాలా మంది మహిళా ఇండస్ట్రియలిస్టులు తమ ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేయాలని గత కొంత కాలం నుంచి కోరుతున్నారని చెప్పారు ఏపీ రాష్ట్ర మంత్రి.
Also Read : శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే తాట తీస్తాం