Godavari Floods AP : గోదావరి ఉగ్ర రూపం ఏపీ అప్రమత్తం
పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
Godavari Floods AP : నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు తెలంగాణను ముంచెత్తుతుంటే మరో వైపు ఏపీలో సైతం వానలు దంచి కొడుతున్నాయి.
వరద పోటెత్తడంతో గోదావరమ్మ ఉగ్ర రూపం దాల్చుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరిక దిశగా వరద ప్రమాదం కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వస్తున్న వరద ఉధృతిని తట్టుకునేందుకు దిగువనకు నీళ్లు వదులుతున్నారు.
దీంతో ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద అప్రమత్తం చేశారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ కు భారీగా నీరు చేరుతోంది. నీటి మట్టం 60 అడుగులకు చేరింది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది.
ఏపీలోని గోదావరి దెబ్బకు (Godavari Floods AP) ఆరు జిల్లాలు ప్రభావానికి గురయ్యాయి. లంక గ్రామాలు బిక్కు బిక్కుమంటున్నాయి. వేల్పేరుపాడు 37 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.
4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అచంట, యలమంచలి, నర్సాపురం గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
రాష్ట్రంలోని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి , ఏలూరు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మొత్తం 42 మండలాలు, 524 గ్రామాలు నీళ్లతో నిండి పోయాయి.
భారీ ఎత్తున కురుస్తున్న వర్షాల తాకిడికి జనం తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. భారీ వర్షాల తాకిడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఏపీ సీఎస్. మరో వైపు తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది.
Also Read : ఆగని వాన తల్లడిల్లుతున్న తెలంగాణ