Gold Siezed : చెన్నై ఎయిర్ పోర్ట్ లో 6 కేజీల పసిడి పట్టివేత
రూ. 3.09 కోట్ల విలువైన పసిడి, ఎలక్ట్రానిక్ పరికరాలు
Gold Siezed : భారీ ఎత్తున బంగారంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు పట్టుబడిన సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లో రూ. 3.09 కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు పట్టుబడ్డాయి.
డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం ఆగస్టు 3, 4 తేదీలలో దుబాయ్ నుండి ఇక్కడికి ఇద్దరు ప్రయాణికులు చెన్నైకి వచ్చారు. ప్యాసింజర్ల ప్యాంట్ పాకెట్ లలో పేస్ట్ రూపంలో బంగారాన్ని, రెండు పసిడి గొలుసులను స్వాధీనం చేసుకుంది.
రూ. 3.09 కోట్ల విలువైన 6.50 కిలోల బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం(Gold Siezed) చేసుకున్నారు. ఈ విషయాన్ని కస్టమ్స్ విభాగం వెల్లడించింది.
పసిడి, వస్తువులతో పాటు ఖరీదైన సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో సంఘటనలో అంతర్జాతీయ విమానాశ్రయంలోని అరైవల్ మాల్ వద్ద టాయిలెట్ వెనుక పడి ఉన్న పేస్ట్ రూపంలో ఉన్న ఆరు ప్యాకెట్ల బంగారాన్ని(Gold Siezed) కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
అక్రమంగా తీసుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పలు సోదాలు జరుపుతున్నారు.
దేశంలోని వివిధ విమానాశ్రయాలలో మరింత తనిఖీలను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల వివిధ రూపాలలో బంగారంతో పాటు విలువైన ఆభరణాలు, ఖరీదైన వస్తువులు పట్టుబడుతున్నాయి.
ఎంతగా కట్టుదిట్టం చేసినా ఏదో రూపంలో ప్రయాణికులు బంగారాన్ని, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ ను తీసుకు వస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా ఇంత పెద్ద ఎత్తున బంగారం పట్టుబడడంతో విస్తు పోయారు అధికారులు.
Also Read : యూపీలో ఆడపడుచులకు ఉచిత ప్రయాణం