YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పని చేస్తున్ను ఉద్యోగులకు సంబంధించి 11వ పీఆర్సీ సిఫారసులు అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షమీర్ సింగ్ రావత్ వెల్లడించారు.
పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగి 180 రోజుల దాకా సెలవు తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి జీతం కూడా పొందే చాన్స్ ఉంటుంది. దత్తత శిశువు గనుక నెల రోజుల లోపు ఉంటే ఏడాది దాకా సెలవు ఇస్తారు.
ఇక నుంచి ఆరు నుంచి ఏడు నెలల లోపు వయసు ఉంటే 6 నెలల పాటు సెలవు తీసుకునే ఛాన్స్ ఉంది. 9 నెలలు లేక ఆ పై ఉంటే మూడు నెలలు సెలవు తీసుకునేలా అవకాశం కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం. పీఆర్సీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ అవకాశం పెళ్లి చేసుకోని పురుషులు, విడాకులు తీసుకున్న వారు లేదా భార్య చని పోయిన వారికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం.
వికలాంగులైన ఉద్యోగులు కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు ఏటా ఏడు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ పొంద వచ్చని తెలిపింది. నర్సింగ్ ఉద్యోగులు కూడా సెలవులు పొందవచ్చని పేర్కొంది.
ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
Also Read : బావను గెలిపించేందుకే బావమరిది ఎంటర్