Tirumala : ప్రపంచ వ్యాప్తంగా కొలువు తీరిన శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala ). గత కొంత కాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ వస్తోంది కరోనా మహమ్మారి. కొంత కాలం పాటు స్వామి వారి దర్శనం బంద్ చేసింది.
ఆ తర్వాత కొన్ని నిబంధనలు విధిస్తూ దర్శనం చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. కోట్లాది భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను వర్చువల్ విధానంలో దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించింది టీటీడీ.
భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది టీటీడీ. కేవలం డబ్బున్న వాళ్లకు, రాజకీయ నాయకులకు, వ్యాపారులకు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులకు, సినీ సెలబ్రెటీలకు మాత్రమే దర్శనం కల్పిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో ఆన్ లైన్ టికెట్లు త్వరితగతిన అమ్ముడు పోవడం కూడా టీటీడీని (Tirumala )తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. గ్రామీణ స్థాయిలో ఉన్న వారికి ఆన్ లైన్ లో టికెట్లు తీసుకునే అవకాశం లేకుండా పోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో టీటీడీ దిగి వచ్చింది. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోందని దీంతో ఇప్పటి వరకు భక్తుల దర్శనానికి సంబంధించి విధించిన ఆంక్షల్ని ఎత్తి వేసే ఆలోచనలో ఉన్నామన్నారు.
ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలో మాత్రమే పర్మిషన్ ఇచ్చామన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ ను దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.
Also Read : తిరుమలలో ఘనంగా రథసప్తమి