Google Bard AI : చాట్ జీపీటీతో గూగుల్ బార్డ్ ఏఐ ఢీ
చాట్ జీపీటీకి సిఇవో ఛాలెంజ్
Google Bard AI : టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ ఏఐ దెబ్బకు గూగుల్ ఒడిదుడుకులకు లోనైంది. కానీ ఆ తర్వాత తేరుకుంది. ఈ మేరకు ఏఐకి ప్రత్యామ్నాయంగా తను కూడా రంగంలోకి దిగింది. ఈ మేరకు గూగూల్ స్వంతంగా బార్డ్ ఏఐ పేరుతో కొత్త టూల్ ను తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఇది టాప్ లో కొనసాగుతోంది. చాట్ జీపీటీ ఏఐలో కొంత వరకే సమాచారం వస్తుండగా గూగుల్ బార్డ్ ఏఐలో మాత్రం పూర్తి సమాచారం అందజేస్తోంది. ఇది ఔత్సాహకులకు, నిపుణులకు, వృత్తి రంగంలో పని చేస్తున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది.
ఇప్పటికే టెక్నాలజీ పరంగా సెర్చింగ్ లో టాప్ లో కొనసాగుతోంది గూగుల్. ఇక గూగుల్ బార్డ్ ఏఐ(Google Bard AI) అనేది ఎలా పని చేస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చారు ప్రవాస భారతీయుడైన ఆ సంస్థ సిఇవో సుందర్ పిచాయ్. గూగుల్ బార్డ్ ఏఐ అనేది అధిక నాణ్యతతో కూడిన కంటెంట్ ను సృష్టించేందుకు, కస్టమర్లతో మరింత ప్రభావంతంగా పాల్గొనేందుకు తోడ్పుతుందని స్పష్టం చేశారు. సమయాన్ని ఆదా చేయడంతో పాటు డిజిటల్ విక్రయదారులకు శక్తి వంతమైన సాధనంగా పని చేస్తుందని వెల్లడించారు సిఇవో.
దీని ద్వారా తయారు చేసిన కంటెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ లకు , బ్లాగ్ లో కథనాలు రాసేందుకు, వార్తలను తయారు చేసేందుకు, షస్త్రర్ చేసేందుకు వివిధ రూపాలలో అద్భుతమైన టూల్ గా ఉపయోగ పడుతుందన్నారు సుందర్ పిచాయ్. డేటా విశ్లేషణలో గూగుల్ బార్డ్ ఏఐ కీలకంగా పని చేస్తుందన్నారు.
Also Read : Satya Pal Malik : ప్రమాదంలో దేశం – సత్య పాల్ మాలిక్
