Google CEO : బైడెన్ తో సుందర్..సత్య భేటీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీపై చర్చ
Google CEO : టెక్నాలజీలో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ )పై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది యావత్ ప్రపంచమంతా. ఏఐ రావడంతో మానవ వనరులపై తీవ్ర ప్రభావం పడనుందని ప్రచారం జరుగుతోంది.
ఏఐ అంశంపై అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ , ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్బంగా ఐటీ పరంగా టాప్ లో కొనసాగుతున్న గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ , మైక్రో సాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల తోప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇద్దరూ సిఇఓలతో ప్రత్యేకంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో బైడెన్ , హారిస్ ప్రత్యేక భేటీ కలకలం రేపింది. టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు కొనసాగుతున్నాయి. ఇటీవలే చాట్ జిపిటి దెబ్బకు విల విల లాడుతున్నాయి కంపెనీలు. ఏఐ కారణంగా లక్షలాది మంది జాబ్స్ కోల్పోయే ప్రమాదం నెలకొంది.
గూగుల్ సిఇవో సుందర్ పిచాయ్(Google CEO) , మైక్రో సాఫ్ట్ సిఇవో సత్య నాదెళ్లలు ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు అమెరికా ప్రభుత్వానికి. ఈ మీటింగ్ లో బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెఫ్ జైంట్స్ , జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పిచయ్, నాదెళ్లతో పాటు చాట్ జిపిటి ఓపెన్ ఏఐ సిఈవో శాల్ ఆల్ట్ మెన్ , ఆంథ్రో మిక్ సిఈవో డేరియా పాల్గొన్నారు.
Also Read : చైనా కంటే భారత్ కీలకం – టిమ్ కుక్
