Google CEO : $226 మిలియ‌న్లు అందుకున్న పిచాయ్

2022లో ప‌రిహారం అందుకున్న గూగుల్ సిఇఓ

Google CEO : ఆర్థిక మాంద్యం కార‌ణంగా ఏకంగా గూగుల్ సిఇఓ సుంద‌ర్ పిచాయ్(Google CEO) వేత‌నం త‌గ్గింది. దీంతో గ‌త ఏడాది 2022 సంవ‌త్స‌రానికి గాను $226 మిలియ‌న్ల వేత‌నాన్ని పొందారు. సుంద‌ర్ ప‌రిహారంలో సుమారు $218 మిలియ‌న్ల స్టాక్ అవార్డులుఉన్నాయ‌ని ఫైలింగ్ చూపింది.

ఇది మ‌ధ్యస్థ ఉద్యోగి వేత‌నం కంటే 800 రెట్లు ఎక్కువ అని గూగుల్ కంపెనీ సెక్యూరిటీస్ ఫైలింగ్ లో వెల్ల‌డించింది. ఇక గూగుల్ కు చెందిన మాతృ సంస్థ ఆల్ఫా బెట్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉద్యోగాల‌ను తొలగిస్తున్న స‌మ‌యంలో వేత‌న వ్య‌త్యాసం వ‌చ్చింది. కాలిఫోర్నియాకు చెందిన ది మౌంటైన్ వ్యూ జ‌న‌వ‌రిలో ప్ర‌పంచ వ్యాప్తంగా 12,000 ఉద్యోగాల‌ను తగ్గించాల‌ని యోచిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇది దాని గ్లోబ‌ల్ వ‌ర్క్ ఫోర్స్ లో 6 శాతానికి స‌మానం. ఈనెల ప్రారంభంలో తొల‌గింపుల‌పై వివాదం కార‌ణంగా వంద‌లాది మంది ఉద్యోగులు గూగుల్ కు షాక్ ఇచ్చారు. ఏకంగా లండ‌న్ లోని కార్యాల‌యాల వ‌ద్ద వాకౌట్ చేశారు. గ‌త మార్చిలో 200 మందికి పైగా కార్మికుల‌ను తొల‌గించిన త‌ర్వాత గూగుల్ జాబ‌ర్స్ కంపెనీ జ్యూరిచ్ ఆఫీసుల వ‌ద్ద వాకౌట్ చేశారు.

ఆర్థిక మాంద్యం కార‌ణంగా ట్విట్ట‌ర్ తో పాటు ఫేస్ బుక్, మైక్రో సాఫ్ట్, అమెజాన్ , త‌దిత‌ర దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఉద్యోగుల‌ను తొల‌గించే ప‌నిలో ప‌డ్డాయి. ఇక మొద‌టిసారిగా గూగుల్(Google) లో ఉద్యోగులు రోడ్డెక్క‌డం విస్తు పోయేలా చేసింది. మ‌రో వైపు కాస్ట్ క‌టింగ్ లో భాగంగా తాను కూడా వేత‌నంలో కోతకు గుర‌వుతున్న‌ట్లు తెలిపారు సుంద‌ర్ పిచాయ్.

Also Read : దేశంలో కొత్త‌గా 12,193 కేసులు

Leave A Reply

Your Email Id will not be published!