Delhi Govt : ఢిల్లీ ప్ర‌భుత్వ బ‌డుల‌కు గూగుల్ స‌హకారం

వ‌ర్చువ‌ల్..ఆన్ లైన్ క్లాసుల‌కు సాంకేతిక‌త

Delhi Govt : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ఢిల్లీలో(Delhi Govt) కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో ప్ర‌ధానంగా విద్య, ఆరోగ్యం, ఉపాధిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది.

ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఢిల్లీలో విద్యార్థుల కోసం అన్ని సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేస్తోంది. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోంది స‌ర్కార్. విద్య తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని సీఎం కేజ్రీవాల్ న‌మ్మారు.

ఇటీవ‌లే త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన వ‌స‌తి, సౌక‌ర్యాల‌ను చూసి విస్తు పోయారు.

ఇలాంటి మోడ‌ల్స్ ను కూడా తాము త‌మిళ‌నాడులో ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అభినందించారు. తాజాగా ప్రపంచ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మేర‌కు ఢిల్లీ ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకుంది. బుధ‌వారం స్కూల్ ఆఫ్ స్పెష‌లైజ్డ్ ఎక్స‌లెన్స్ కి గూగుల్ అపాక్ ప్రెసిడెంట్ స్కాట్ బ్యూమాంట్ , ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజ‌య్ గుప్తా ఇవాళ ఢిల్లీలోని ప్ర‌భుత్వ పాఠశాల‌ను (Delhi Govt) సంద‌ర్శించారు.

వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా. ఆయ‌న ప్ర‌భుత్వం విద్యా రంగంపై ఎలా ఖ‌ర్చు చేస్తున్నామో తెలిపారు. విద్యార్థుల‌కు ఎలాంటి సౌక‌ర్యాలు ఇస్తున్నామో వెల్ల‌డించారు.

విద్యార్థులు అభివృద్ది సాధించాలంటే సాంకేతిక‌త ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మ‌నీష్ సిసోడియా. ఢిల్లీ స‌ర్కార్, గూగుల్ మ‌ధ్య ఒప్పందం చ‌రిత్రాత్మ‌క‌మ‌న్నారు డిప్యూటీ సీఎం.

Also Read : క‌ర్ణాట‌క మంత్రి ఈశ్వ‌రప్ప‌పై కేసు

Leave A Reply

Your Email Id will not be published!