Google Down : సాంకేతిక లోపం గూగుల్ కు అంతరాయం
మొరాయించడంతో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి
Google Down : యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించిన టెక్ దిగ్గజం గూగుల్(Google Down) ఒక్కసారిగా స్పందించడం మానేసింది. సాంకేతికంగా కొంత ఇబ్బంది ఏర్పడడంతో సెర్చింగ్ సైట్ ఓపెన్ కాలేదు.
దీంతో కోట్లాది మంది వాడే వారంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఏది కావాలన్నా క్షణాల్లో వెతికి కళ్ల ముందు పెట్టే గూగుల్ పని చేయక పోతే ఆ కష్టం తెలిసిన వారికే తెలుస్తుంది.
వినియోగదారులు, నెటిజన్లు, సాంకేతిక నిపుణులు ఏమైందోనని ఆందోళనకు గురయ్యారు. సర్వర్ ప్రాబ్లమా లేక ఎవరైనా హ్యాకర్లు ఏమైనా నిలిపి వేశారా. లేక టెక్ కంపెనీలోనే ఏదైనా లోపం తలెత్తిందా అన్న అనుమానం వ్యక్తమైంది ప్రపంచ వ్యాప్తంగా.
గూగుల్ ఓపెన్ చేసినా సారీ ఫర్ ది ఇంటరప్షన్ అన్న ట్యాగ్ లైన్ ఓపెన్ కావడంతో ఒక్కసారిగా పరేషన్ కు గురయ్యారు. 40, 000 వేల మందికి పైగా యూజర్లు గూగుల్ లో తలెత్తిన సాంకేతిక ఇబ్బందిని గుర్తించారు.
ఆ మేరకు సంస్థకు తెలియ చేశారు. తర్వాత కొద్ది సేపు మొరాయించిన విషయాన్ని గూగుల్ గుర్తించి సరి చేసింది. ఆ తర్వాత యధావిధిగా తమ కార్యకలాపాలలో మునిగి పోయారు.
ఇటీవలి కాలంలో గూగుల్ కు ఇలాంటి ఇబ్బంది ఏర్పడడం ఇదే మొదటిసారి. ఈ అంతరాయం ఆగస్టు 8న చోటు చేసుకుంది. ప్రస్తుతం గూగుల్ తీవ్రంగా శోధిస్తోంది.
ఎక్కడ పొరపాటు జరిగిందనే దానిపై. డౌన్ డిటెక్టర్ కామ్ ప్రకారం వేలాది మంది వినియోగారులు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నారని వెల్లడించింది.
Also Read : ఆ కంపెనీని మార్చేసిన ఫోన్ కాల్